ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.. ముఖ్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవహారలపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు.. ఫైళ్ల క్లియరెన్సు, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఇతర పాలనాపరమైన అంశాలపై సమీక్షించనున్నారు..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. బద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు.. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్ కొనసాగుతోంది..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభంకానుంది.. ఈ పర్యటనలో మూడు రోజులు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పవన్ ఆలయాల సందర్శన కొనసాగనుంది.. ఈ ఆధ్యాత్మిక యాత్రలో.. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారని ఆయన టీమ్ చెబుతోంది.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఘటనపై స్పందించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ దాడి దురదృష్టకరమన్న ఆయన.. ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ భూమికారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు.. సత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్లపల్లికి భూమికారెడ్డి భౌతికకాయాన్ని తరలించారు కుటుంబ సభ్యులు.. తమ గ్రామానికి చెందిన యువ వైద్యురాలు ప్రాణాలు పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. డాక్టర్ భూమికారెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు..
పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై కత్తితో దాడి సందర్భంగా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. రాప్తాడులో ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్న పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులకు సిగ్గుండాలని, పోలీసులు పరిటాల కుటుంబం గుమస్తాలు, వాచ్మెన్లు కాదని విమర్శించారు.