ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వీఐపీల భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు సిద్ధమైంది.. దీనిపై ఆదేశాలు జారీ చేసింది హోంశాఖ.. 10 టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ఫ్రూఫ్‌గా మార్చాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
గిరిజన హక్కులకు కట్టుబడి ఉన్నామని.. 1/70 చట్టాన్ని రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. గిరిజనుల అస్తిత్వం కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడు కోవడమే.. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నంబర్ 3 తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగాలు, గిరిజనులకు ఇచ్చేలా చేశాం అన్నారు సీఎం చంద్రబాబు..
కోళ్లలో వేగంగా వ్యాప్తిస్తోన్న వైరస్ పట్ల రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. వైరస్ పట్ల అప్రమత్తంగాఉండాలంటూ రాష్ట్రాలకు సూచించింది.. దీంతో.. అలర్ట్ అయిన తెలంగాణ పశు సంవర్ధక శాఖ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.. టీజీ పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్.. జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు..
నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వివిధ వర్గాల ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా సంస్థ కార్యాలయానికి నిర్వాహకుడు రాకపోవడంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు... దీంతో నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు వసూళ్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి.. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లు మినహాయించి మిగతా అన్ని బ్రాండ్లు మీద సైజుతో సంబంధం లేకుండా రూ. 10 చొప్పున ధరలు పెరిగాయి.. రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కోసం అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. ఒక్కో క్లబ్ లో టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కలిపి సభ్యులుగా మొత్తం 10 మంది ఉండేలా చూసుకోవాలని సూచించింది..
యాక్ట్ 1/70 మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.. గిరిజనులు ఆందోళన చెoదవద్దు అని విజ్ఞప్తి చేశారు..
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర వరుస అగ్నిప్రమాదాలు కలకలం సృష్టించిన విషయం విదితమే కాగా.. అయితే, అగ్నిప్రమాద ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.. కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనదారుల పేర్లు, వారి వాహనం నంబర్ల వివరాలు ఇవ్వాలని సూచించారు.. దీంతో, పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ ను ఇవ్వాలని కోరారు..