PM Modi Amravati Tour: ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అమరావతికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్‌లో వెళ్లాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఉదయం 5 గంటలకే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాగా.. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండబోతున్నాయి.. వీవీఐపీలు, వీఐపీలు నోవాటెల్ వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా బందరు రోడ్డు వెళ్లే ప్రకాశం బ్యారేజ్ మార్గంలో సభావేదిక మార్గం ఏర్పాటు చేశారు.
Read Also: Veera Raghava Reddy : మొయినాబాద్‌లో వీర రాఘవరెడ్డిపై దాడి.. వాతలు వచ్చేలా…!
* విశాఖ నుండి చెన్నైకి వెళ్తున్న వాహనాలు – కత్తిపూడి → కాకినాడ → అమలాపురం → రాజోలు → నరసాపురం → మచిలీపట్నం → రేపల్లె → బాపట్ల → ఒంగోలు మార్గంలో మళ్లించారు.
* చెన్నై నుంచి విశాఖ వైపు వెల్లే వాహనాలు – ఒంగోలు → త్రోవగుంట → బాపట్ల → రేపల్లె → అవనిగడ్డ → మచిలీపట్నం → లోస్రా బ్రిడ్జి → నరసాపురం → అమలాపురం → కాకినాడ → కత్తిపూడి మార్గంలో వెళ్లాలని ఆదేశించారు.
* గుంటూరు జిల్లా నుంచి విశాఖ వెళ్లే వాహనాలు – బడంపాడు క్రాస్ రోడ్ → తెనాలి → పులిగడ్డ → మచిలీపట్నం → నరసాపురం → కాకినాడ మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.
* విశాఖ నుండి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు (తూర్పు గోదావరి) – దివాన్ చెరువు → గమన్ బ్రిడ్జి → దేవరపల్లి → గోపాలపురం → జంగారెడ్డిగూడెం → అశ్వారావుపేట → ఖమ్మం → సూర్యాపేట రోడ్డులో వెళ్లాల్సి ఉంటుంది.
* హైదరాబాద్ రూట్‌లో ప్రయాణికులకి మూడు మార్గాలను సూచించారు పోలీసులు..
• భీమడోలు → ద్వారకాతిరుమల → చింతలపూడి → ఖమ్మం
• ఏలూరు బైపాస్ → జంగారెడ్డిగూడెం → అశ్వారావుపేట
• ఏలూరు బైపాస్ → చింతలపూడి → సత్తుపల్లి
* కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు – హనుమాన్ జంక్షన్ → నూజివీడు → మైలవరం → ఇబ్రహీంపట్నం → నందిగామ మార్గంలో ప్రయాణించాలి.
* హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లే వాహనాలు (NTR జిల్లా):
• నందిగామ → మధిర → వైరా → సత్తుపల్లి → అశ్వారావుపేట → జంగారెడ్డిగూడెం → దేవరపల్లి → గమన్ బ్రిడ్జి
• ఇబ్రహీంపట్నం → మైలవరం → నూజివీడు → హనుమాన్ జంక్షన్ → ఏలూరు మార్గం
* విజయవాడ ఎయిర్‌పోర్ట్ వెళ్లే ప్రయాణికులు – రామవరప్పాడు ఫ్లైఓవర్ → ఆంధ్రజ్యోతి → ముస్తాబాద్ → సూరంపల్లి అండర్‌పాస్ → కొత్త బైపాస్ → బీబీగూడెం అండర్‌పాస్ → గన్నవరం మీదుగా చైతన్య స్కూల్ జంక్షన్ వద్దకు చేరుకోవాలి. అక్కడ నుంచి ఎన్‌హెచ్ 16కు వచ్చి అక్కడినుండి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంటుంది.