PM Modi Amaravathi Re Launch: మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజధాని అమరావతి రీలాంచ్‌లో పాల్గొనబోతున్నారు.. అయితే, ప్రధాని టూర్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. నిఘా నీడలోకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లిపోయింది.. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీసులు నిలిపివేశారు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ఎయిర్‌పోర్ట్ ప్రధాన గేటు వద్ద ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు.. ఇక, ఎయిర్‌పోర్ట్ పిక్ అప్ కి వచ్చే వారికి పాస్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు పోలీసులు..
Read Also: MLC Kavitha : భౌగోళిక తెలంగాణ సాధించాం.. కానీ సామాజిక తెలంగాణ మాత్రం ఇంకా సాధించాల్సిందే
మరోవైపు ప్రధాని మోడీ సభకు తరలివచ్చే మార్గాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు పోలీసులు.. 6500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఈ భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారని అంచనాలు ఉండగా.. 37 మంది ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ లతో భద్రత పర్యవేక్షిస్తున్నారు.. ప్రధాన మార్గాల్లో వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పాస్‌లు ఉంటే వేదిక దగ్గరకు అనుమతి ఇస్తున్నారు.. మిగతా వాహనాలకు 256 ఎకరాల్లో ఉన్న పార్కింగ్ ప్రాంతాలకు పంపిస్తున్నారు.. అంతేకాదు.. రూట్ మ్యాప్ కోసం క్యూ ఆర్ కోడ్ లు ఏర్పాటు చేశారు అధికారులు..
Read Also: HHVM : హరిహర వీరమల్లు రిలీజ్ పై గందరగోళం..
అమరావతి పునఃప్రారంభ సభకు ప్రధాని మోడీ విచ్చేయనున్న నేపథ్యంలో విజయవాడలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.. విజయవాడ నగరంలో 599 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు.. 175 కీలక ట్రాఫిక్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు.. నగర శివారుల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెట్టారు.. 10 క్రేన్‌లు, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. సభ ప్రాంతానికి వీవీఐపీ రూట్లపై ముందస్తుగా నిఘా పెట్టారు.. గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి ఇప్పటికే వాహనాల బారులు తీరాయి.. ట్రాఫిక్ క్యూలు నివారించేందుకు అస్త్రం యాప్ ఉపయోగిస్తున్నారు.. ట్రాఫిక్ బ్రేక్‌డౌన్, ఎమర్జెన్సీ పరిస్థితులకు ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారు పోలీసులు..
Read Also: Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
కాగా, ప్రజా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దబోతోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఒక మహోన్నత లక్ష్యంతో 2015లో కొత్త రాష్ట్రంలో. కొత్త రాజధాని సంకల్పం జరిగింది..8603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతంగా గుర్తించారు.ఇందులో 217 చ.కి.మీ. పరిధిలో రాజధాని నగరం నిర్మించబోతున్నారు.దీనిలో 16.9 చ.కీ పరిథిలో కోర్ క్యాపిటల్ ఉంటుంది. ఎపిసిఆర్డిఏ యాక్ట్ 2014 ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పాటు అయింది. రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వేల ఎకరాలు ఇచ్చిన దేశంలోనే ఒకే ఒక ప్రాజెక్ట్ ఇది. 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరణ చేపట్టడం ఒక సక్సెస్ మోడల్ గా ప్రభుత్వం చెబుతోంది..34281 ఎకరాలు భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. 4300 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకున్నారు. మిగిలిన 15,167 ఎకరాల భూమి ప్రభుత్వ, అటవీ, కొండ, ఇతర భూమలు ఉన్నాయి.