ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం అన్నారు లోకేష్.. ఇక, యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. శాఖల వారీగా పురోగతిపై చర్చ జరిగింది... ఆర్టీజీఎస్ ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే నిర్వహించింది.. దీనిపై చంద్రబాబు సమీక్ష చేశారు..
పీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని పేర్కొన్న ఆయన.. ఇక, వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. వాళ్ల పార్టీ.. ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.. వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న ఆయన.. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం మాకు ఏమి ఉంటుంది?…
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దారు కార్యాలయాలను నిర్మిస్తాం అని తెలిపారు రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు శాసనసభలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తాం అన్నారు..
ఎమ్మెల్సీ తనకు రాకపోవటంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నాకు దేవుడు.. నేను ఆయన భక్తుడిని అన్నారు.. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడు.. కానీ, నాకు పదవి వచ్చినా.. రాకపోయినా.. అంకిత భావంతో పనిచేస్తాను అని స్పష్టం చేశారు..
కడప జిల్లా సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ లోని లంకమల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. సిద్ధవటం రేంజ్ లో 64 ప్రాంతాలను గుర్తించి 128 అత్యాధునిక డిజిటల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మద్దూరు, కొండూరు, ముత్తుకూరు, పొన్నపల్లి, గొల్లపల్లె అటవీ ప్రాంతాలలో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు.. రాష్ట్రస్థాయి పులుల గణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పులులు ఘనన చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారిని కళావతి తెలిపారు.
కుమారుడు మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లి వద్దకు వచ్చిన ఓ వానరం.. ఆ తల్లిని ఓదార్చింది. ఇక, తన కుమారుడే వానరం రూపంలో తన వద్దకు తిరిగి వచ్చాడని.. ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది..