సినీనటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై నేడు కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది.. పోసాని బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది.. మరోవైపు, పోసాని కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది కోర్టు.. గత 5 రోజులుగా కర్నూలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు పోసాని..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో టీడీపీ మూడు, జనసేన, బీజేపీ చెరో ఒకటి ఎమ్మెల్సీ స్థానాలు తీసుకుంటున్నాయి.. ఐదు స్థానాలు అధికార కూటమికి రావడంతో వైసీపీ నుంచి పోటీ లేదు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రోత్సహించడంలో భాగంగా అభ్యర్థులు ఎంపిక జరిగింది.. ఈసారి ఎమ్మెల్సీ స్థానాలకు చాలామంది ఆశావహులు ఉన్నారు.. ఇంచుమించుగా పాతిక నుంచి 30 మంది వరకు పోటీలో ఉన్నారు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ... దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాద్ధాంతం నడుస్తున్నట్టు తెలిసింది. కేంద్రం మంజూరు చేసిన స్కూల్‌ను తాను సూచించిన ప్రాంతంలో ప్రారంభించమని పట్టుబడుతున్నారట నిజామాబాద్ ఎంపీ అర్వింద్. జక్రాన్ పల్లి మండలం కలిగోట్‌లో పెట్టాలంటూ... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట ఎంపీ.
కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి ముగిసేసరికి మరొకటిగా పెరుగుతున్న వివాదాలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు కూడా బలి పశువులు అవుతున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేది ఒక పార్టీ, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానిది మరో పార్టీ కావడంతో.... వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మాకు శాపంగా మారాయని అంటున్నారు సిబ్బంది. ఒకరు పని చేయమంటే మరొకరు వద్దంటున్నారని, ఎవరి మాట వినాలో తెలియక గందరగోళంలో ఉన్నామని అంటున్నారట.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో సీనియర్స్‌కి కొదవేం లేదు. అదే... ఎక్కడికక్కడ ఆధిపత్య పోరుకు బీజం వేసిందన్నది పార్టీ నేతల మాట. వీరిని కట్టడం చేసేందుకు గతంలో ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు ప్రయత్నించేవారు. అభిప్రాయ తమ అనుభవాన్ని, పొలిటికల్ సీనియారిటీని ఉపయోగించి వేదికల మీద జరిగే గొడవల్ని నాలుగు గోడల మధ్యకు తీసుకురాగలిగేవారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12 నుంచి మొదలవబోతున్నాయి. దాంతో.... మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా? రారా అన్న చర్చ మరోసారి జరుగుతోంది రాజకీయవర్గాల్లో. బీఆర్ఎస్ అధ్యక్షుడు సభకు వస్తే ఆయన్ను టార్గెట్ చేసేందుకు రెడీగా ఉందట కాంగ్రెస్. ఆయన పదేళ్ళ పాలనను సభ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ...
పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరిగే సభ కావడంతో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అన్నారు.. రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు.. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ ఆవిర్భావ సభ ఉద్దేశని వెల్లడించారు..