రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721.48 కోట్ల రూపాయలు అని.. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే.. సభలో 164 మంది సభ్యులు ఉండాలి.. కానీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు శాతం భారీగా తగ్గిపోయింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా.. అసెంబ్లీకి రావడం లేదు ఎమ్మెల్యేలు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటు వరకు బిజీగా ఉన్నారని భావించినా.. ఆ తర్వాత కూడా హాజరు శాతం తగ్గింది.. ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండా సభ నడుస్తోంది..
కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై మన ప్రశ్న - వారి సమాధానం.. తల్లికి వందనం ఎప్పుడు? జవాబు.. మీకు 11 సీట్లు.. ప్రతి మహిళకు నెలకు 1500/- ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు..
ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ అక్రమాలు పుట్ట పగిలింది. వృద్ధులు, అనాథల పేరుతో తక్కువ ధరకు భూములు తీసుకుని వేల కోట్లు వ్యాపారం చేసిన రియల్టర్లుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నగరంలో అత్యంత వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నేడు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికార సంస్థ (సీఆర్డీఏ) కీలక సమావేశం జరగనుంది.. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీఏ 45వ సమావేశం జరగనుండగా.. రాజధాని పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నా ఈ అథారిటీ.. సుమారు 40 వేల కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది సీఆర్డీఏ భేటీ..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలు చేశామని కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. దీంతో, ఈ కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణ మురళి పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు.. ఇక, విజయనగరం, గుంటూరు, అల్లూరి సీతా రామరాజు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 34 BNS ప్రకారం నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం అన్నారు లోకేష్.. ఇక, యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..