పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరిగే సభ కావడంతో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అన్నారు.. రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు.. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ ఆవిర్భావ సభ ఉద్దేశని వెల్లడించారు..
ప్రజల భద్రత మరింత పెంచేందుకు ఏలూరు పోలీసుల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రోడ్లపై ఇష్టానుసారం పార్కింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై, నిర్మాణస్య ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే దొంగలపై మాత్రమే కాదు ఊరేగింపులు, వేడుకల వద్ద అల్లర్లకు పాల్పడే ఆకతాయిలను గుర్తించేందుకు డ్రోన్ల సాయంతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
కడప వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుచేత రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు.. పులివెందుల ఆర్డీవో సమక్షంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికి తీసి శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై క్షుణ్ణంగా వైద్య బృందం పరిశీలించారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై స్పందిస్తూ.. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరు.. కానీ, రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట.. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కేబినెట్ లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు.. కానీ, ఇతర…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన "శక్తి" యాప్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన 'శక్తి' యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం.
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. పోసానికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది విజయవాడలోని సీఎంఎం కోర్టు.. ఈ రో సీఎంఎం కోర్టులో పోసానిని హాజరు పరిచారు పోలీసులు.. అయితే, తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయాధికారికి చెప్పారు పోసాని.. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు..
ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు అవుతుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఇంటరాక్షన్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నా కుటుంబంతో పాటు వ్యాపారంలో భువనేశ్వరి పాత్ర కీలకం. హెరిటేజ్ సంస్థని భువనేశ్వరి డెవలప్ చేశారని ప్రశంసలు కురిపించారు.. ఇక, నా తల్లి పడిన ఇబ్బందులు మహిళలు పడకూడదనే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశానని…
సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారు.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదంటూ కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయన్న ఆమె.. చంద్రబాబు మోసాలపై ఏపీ మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. రోజుకు 70 మంది మహిళలు, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి..