YS Jagan Nellore Tour: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. వైసీపీ నేతలపై మరో కేసు నమోదు..
- వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మరో కేసు..
- ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ..
- వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..
- ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేసిన దర్గామిట్ట పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One more case on YS Jagan Nellore Tour: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో పర్యటించారు.. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఇంటికి వెళ్లారు.. అయితే, జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది.. మరోవైపు.. జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.. జగన్‌ను చూసేందుకు వెళ్తూ ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. ఇప్పటికే ప్రసన్నకుమార్ రెడ్డిపై రెండు కేసులు నమోదు అయ్యాయి.. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేతలపై మరో కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు..
Read Also: Pregnant women : తల్లి అయ్యే ముందు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు !
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
కాగా, నెల్లూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి కూడా నేను వెళ్ళకూడదా? అని ప్రశ్నించారు.. నా వెనుక జనం రాకుండా, నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు..? జనం రాకుండా రోడ్లను తవ్వేశారు.. ప్రజలను రాకుండా ఆపడానికి 2 వేల మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఏముంది ? బాబు గారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే… ఎందుకు ఇంత భయపడుతుంది..? తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడు.. విద్య వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారు అని ఫైర్ అయ్యారు.. మా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారు.. రోజా , విడుదల రజిని పై కారు కూతలు కూస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారు.. ఏ తప్పు చేశాడని కాకానిని జైల్లో పెట్టారు ? అని ప్రశ్నించారు.. అయితే, జగన్ పర్యటనపై అదేస్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి నేతలు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు..
తాజావార్తలు
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
-
New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
-
Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?