House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. 2026 సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో (తొలి త్రైమాసికం), దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అందుబాటు ధరలో ఉండే ఇళ్ల అమ్మకాలు 23 శాతం మేర పడిపోయాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రూ. 50 లక్షల లోపు ధర ఉండే ఇళ్లను ఈ విభాగంలోకి చేరుస్తారు.
నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం వల్ల ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడానికి వెనుకాడాల్సి వస్తోంది. హోమ్ లోన్‌ల మీద వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం కూడా సామాన్యుల బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. అంతే కాకుండా.. తక్కువ ధర ఇళ్ల అమ్మకాలు తగ్గుతున్నా, కోట్లాది రూపాయల విలువైన ఖరీదైన ఇళ్ల అమ్మకాలు మాత్రం పెరుగుతున్నాయి. బిల్డర్లు కూడా లాభాలు ఎక్కువగా వచ్చే ఖరీదైన ప్రాజెక్టుల మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
ముంబై, ఢిల్లీ-NCR, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కొత్తగా ఇల్లు కొందామనుకునే వారికి తక్కువ ధరలో ఆప్షన్లు దొరకడం కష్టంగా మారుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం లేదా బ్యాంకులు చొరవ తీసుకుని వడ్డీ రేట్లు తగ్గించకపోతే, సామాన్యుడి సొంత ఇంటి కల మరింత కష్టమయ్యేలా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!