East Godavari: తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు గుట్టు రట్టు అయ్యింది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈ మేరకు స్థానికులు సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాజానగరం తహసీల్దార్, మైనింగ్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 19 లారీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఇక, తహసీల్దార్ ఫిర్యాదు మేరకు రాజానగరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.. 19 మట్టి లారీలు పోలీసులు, మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. గత కొంతకాలంగా కలవచర్ల వద్ద పోలవరం కాలువలో ఎమ్మెల్యే అనుచరులు అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Chiranjeevi : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..
అయితే, పోలవరం కాలువలకు తూట్లు పొడిచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారంటూ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.. రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలు వైసీపీ శ్రేణులు అడ్డుకొని.. అధికారుల సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యహారం బయటకు వచ్చింది.. ఇక, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఘటనా స్థలానికి అధికారులు వెళ్లడంతో.. గుట్టుగా సాగుతోన్న వ్యవహారం బట్టబయలు అయినట్టు అయ్యింది..