AP PGCET-2025 Results: ఏపీ పీజీసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి.. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఏపీ పీజీసెట్-2025 ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్.. మొత్తం 31 బ్రాంచ్‌లలో 88.60 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు.. పీజీసెట్ -2025 కోసం 25,688 మంది నమోదు చేసుకోగా.. వారిలో 19,488 మంది అర్హత సాధించారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.. వీరిలో 7463 బాలురు అంటే 87.70 శాతం.. మరియు 12025 మంది బాలికలు అంటే 89.17 శాతం అర్హత సాధించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. ఇక, https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET/PGCET_HomePage.aspx ద్వారా ర్యాంక్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.. మరోవైపు.. మన మిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.. ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.. ఇక, ఏపీ పీజీసెట్ 2025లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..
📢 APPGCET- 2025 results are out!
✅ 88.60 % overall pass rate across 31 Branches
📈 25,688 registered | 19,488 qualified
7463 (87.70 %) 👦 boys & 12025 (89.17 %) 👧girls qualified
🔗 Download rank cards: https://t.co/wtuYexIxB7
📱Also through Mana Mitra WhatsApp No.…
— Lokesh Nara (@naralokesh) June 25, 2025