వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం - వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కొంతమంది మంత్రులు అధికారులు కూడా స్టాళ్లు పరిశీలించారు.
రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా ఒంగోలులో లాసెట్ ఎగ్జామ్‌కి హాజరయ్యారు.. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10.30 గంటలకు వరకు జరిగిన లాసెట్ ఎగ్జామ్‌ను ఏబీ వెంకటేశ్వరరావు రాశారు.
ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువతరమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటిన సంజనా వరద, తాజాగా మిస్ గ్రాండ్ ఇండియా 2025 ఫైనలిస్టుగా ఎంపికయ్యారు. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ జూలై 3 నుండి జూలై 13 వరకు ఢిల్లీలో జరగనుంది, ఇందులో దేశం నలుమూలల నుండి ఎంపికైన 30 మంది ఫైనలిస్టులు తలపడి, విజేతగా ఎంపికైన వారు థాయిలాండ్‌లో జరగనున్న మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2025 పోటీలో భారత్‌కి ప్రాతినిధ్యం వహిస్తారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు పెట్టారు పోలీసులు.. అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించిన వైసీపీ 'వెన్నుపోటు దినం' పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.. అయితే, ర్యాలీగా వస్తున్న అంబటిని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దీంతో, సీఐపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు..
శ్రీశైలం దేవస్థానంలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలు జరిగాయి.. ఏకంగా 95 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.. దీంతో, శ్రీశైలం దేవస్థానంలో 95 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగినట్టు అయ్యింది.
శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ ఘటన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ.... అంతకు ముందు సరఫరా సంస్థ బోలేబాబా డెయిరీల ఒప్పందాల వెనుక జరిగిన రహస్య అంగీకారాలు నిగ్గు తేల్చేందుకు సిట్ దర్యాప్తు చేపట్టింది.
చిన్నస్వామి స్టేడియంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది.. ఉహించని విధంగా.. ఈ ఘటనలో ఏకంగా 11 మంది మృతి చెందాదారు.. దాదాపు 33 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర్ల సహాయంతో దొర్నిపాడు మండలం అర్జునపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.
మొక్కలు నాటేందుకు ప్రజలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాజధాని ప్రాంతంలోని అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో మొక్కలు నాటబోతున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకాబోతున్నారు..