Srikalahasti: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడు.. తమిళనాడులో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.. చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో కాళహస్తికి చెందిన యువకుడు రాయుడు మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. రాయుడుని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఈ హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ వినూత.. ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు.. అయితే, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. పోలీసుల విచారణలో వినూత దంపతలు కీలక అంశాలు బయటపెట్టారట..
Read Also: CJI Gavai : న్యాయవ్యవస్థలో ఇప్పుడు ఏఐని ఉపయోగించుకోవచ్చు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
జూన్ 21వ రాయుడును అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన, మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి, మాకు ఎన్నో రకాలుగా ప్రాణ, గౌరవ అంశాలలో భంగం కలిగించాడని.. దాంతో, రాయుడును పని నుండి తొలగించినట్టు వెల్లడించారట వినూత, చంద్రబాబు దంపతులు.. అయితే, ఈ నెల 8వ తేదీన చెన్నైలో కూవం నదిలో సమీపంలో రాయుడు డెడ్ బాడీని గుర్తించారు చెన్నై పోలీసులు.. గత రాత్రి వినూత కోట, భర్త చంద్రబాబు సహా శివకుమార్, గోపి దాసర్ లను అరెస్టు చేశారు పోలీసులు.. అయితే, పోలీసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది.. 15 సంవత్సరం వయస్సు నుండి వినూత ఇంటిలో రాయుడు పనిచేసేవాడు.. కానీ, తమ ప్రత్యర్థిల నుండి డబ్బులు తీసుకొని.. వినూత కుటుంబ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు ఆ కుటుంబం సభ్యుల దృష్టికి వచ్చిందట.. దీంతో పని నుంచి తొలగించామని వెల్లడించారట.. అయితే, మేం దాడి చేశామే తప్ప రాయుడుని చంపలేదని పోలీసుల విచారణలో వినూత, చంద్రబాబు తెలిపినట్టుగా తెలుస్తోంది.. తనకు తానే చనిపోయాడు.. తప్ప.. మేం హత్య చేయలేదంటున్నారట వినూత, చంద్రబాబు దంపతులు.. ఇక, ఈ కేసులో సంచలనంగా మారిన పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..