Ashok Gajapati Raju: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నిమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా.. గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు.. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్‌ను నియమించారు.. అయితే, సీనియర్ రాజకీయ నేత, ఏపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ సేవలు అందించిన విజయనగరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇప్పుడు గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. దీంతో, ఉత్తరాంధ్రకు రెండో కీలక పదవి దక్కినట్టు అయ్యింది.. ఇప్పటికే ఒడిశా గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు ఉండగా.. ఇప్పుడు గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియమితులు అయ్యారు.. అయితే, తన 36 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఇలా వివిధ హోదాల్లో ఆయన సేవలు అందించారు..
అశోక్‌గజపతిరాజు ప్రస్థానం:
అశోక్‌గజపతిరాజు తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేశారు.. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.. మొత్తం 36 ఏళ్ల రాజకీయ జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యేగానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసారు. ఇక, 2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు. దీంతో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా.. పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు, గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబునాయుడు హయాంలో ఫైనాన్స్, లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్న ఆయన్ను.. గోవా గవర్నర్‌గా పంపించింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్..
కేంద్ర మాజీ మంత్రి పుసపాటి అశోక్ గజపతి రాజు.. 26 జూన్ 1951లో విజయనగరం రాజ కుటుంబంలో జన్మించారు.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వీఎస్ కృష్ణ కాలేజ్, విశాఖపట్నంలో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది.. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా, MANSAS (Maharaja Alak Narayana Society) ట్రస్ట్ చైర్మన్‌గా సేవలు అందించారు.. అయితే, 1978న జనతా పార్టీ తరఫున విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో, ఆ తర్వాత 1983 నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఏపీ కేబినెట్‌లో ఎక్సైజ్ (1985–89), వాణిజ్య పన్నులు, Legislative Affairs, ఆర్థిక, రెవెన్యూ (1994–2004), 2014లో విజయనగరం నుంచి లోక్‌సభ ఎంపీ.. 26 మే 2014–9 మార్చి 2018 వరకు కేంద్ర విమానయాన మంత్రిగా పనిచేశారు..
ఇక, 2018 మార్చిలో ఏపీ స్పెషల్ స్టేటస్ వివాదం కారణంగా రాజీనామా చేశారు. MANSAS ట్రస్ట్ పై వృద్ధి, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో ఆధారిత ప్రోగ్రామ్‌లు పరిగణనీయంగా విస్తరించారు.. ఆయన తండ్రి పీవీజీ Raju ఆధ్వర్యంలో స్థాపిత Simhachalam and ఇతర ఆలయాల వారసత్వం కొనసాగిస్తున్నారు. అశోక్ గజపతి రాజు విజయనగరం రాజ కుటుంబానికి చెందిన, దక్షిణ భారతంలోని ప్రముఖ రాజకీయ దార్శనికుడు. రాష్ట్రంలో పన్ను, ఆర్థిక, ఏరియా అభివృద్ధి, కేంద్ర విమానయాన విధానాల పైన ముఖ్య పాత్రలు పోషించారు. మరోవైపు, గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ అపూర్వ విజయాన్ని అందుకోగా.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ టీడీపీ కీలకంగా మారింది.. ఈ ఎన్నికల్లో సీనియర్ నేతలను పక్కన బెట్టిన టీడీపీ.. ఇప్పుడు పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న అశోక్‌గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇప్పటించి గౌరవించింది..