కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీది వేముల వద్ద వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ ను దారుణంగా హత్య చేశారు. దుండగులు బండ రాయితో తలపై కొట్టి చంపారు. కర్నూలు నుంచి బైక్ పై సొంతూరు మీదివేములకు వెళ్తుండగా కాపుకాచి హత్య చేశారు. హత్యకు రాజకీయపరమైన కారణాల, వ్యక్తిగత కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దగ్గు జలుబుతో ఆసుపత్రికి చేరిన వారికి కరోనా టెస్టులు చేయడంతో ఒకేసారి 6 కేసులు బయటపడ్డాయి. కరుణ లక్షణాలు తక్కువగా ఉండడంతో ఐదుగురిని హోమ్ ఐసోలేషన్ పంపిన వైద్యులు.. మరో ఒకరికి నెల్లూరులోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు.
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.. డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు... కానీ, ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ నిబంధన అమలు చేస్తున్నారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడి గ్రామం యర్రగట్టవాండ్లపల్లెకు చెందిన బి.దివ్యాంశి (14) అనే బాలిక మృత్యువాత పడ్డారు. యర్రగట్టవాండ్లపల్లె చెందిన శివకుమార్ బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. భార్య అశ్విని, ఇద్దరు పిల్లలతో కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
వేసవి తాపానికి.. ఎండల తీవ్రతను తట్టుకోలేక.. నదులు, కుంటలు, బావుల్లో ఈతలు కొడుతూ సేదతీరుతున్నారు.. అయితే, సమయంలో అనుకోని ప్రమాదాలతో ఈ ఏడాది ఇప్పటికే ఏపీలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా, చిత్తూరు జిల్లా వీకోటలో విషాదం నెలకొంది.. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు.. దీంతో, శోకసంద్రంగా మారింది మోట్లపల్లి గ్రామం..
అడవులు, పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం - వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు,