Bhumana Karunakar Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యమతస్థ ఉద్యోగుల అంశం చిచ్చు కొనసాగుతూనే ఉంది.. నిన్నటి రోజున శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీలో వున్న వెయ్యి మందికి పైగా అన్యమతస్థులను సాగనంపాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు దుమారం రేపగా.. దీనిపై కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అసలు, టీటీడీలో వెయ్యి మంది అన్యమతస్థ ఉద్యోగులు వున్నారని ఏ ప్రాతిపదికన.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వాఖ్యలు చేశారని ప్రశ్నించారు కరుణాకర్ రెడ్డి.
Read Also: CM Chandrababu: మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చిన సీఎం.. ఆనందానికి అవదులు లేవు అంతే..!
టీటీడీలో 22 మంది అన్యమతస్థ ఉద్యోగులు వున్నారని ప్రస్తుత పాలకమండలి ఇటీవలే ప్రకటించిందని గుర్తు చేసిన కరుణాకర్ రెడ్డి.. మరి బండి సంజయ్ వెయ్యి మంది వున్నారని ఏ నివేదిక ఆధారంగా ఆరోపించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. బండి సంజయ్ వ్యాఖ్యలో కుట్రకోణం దాగి వుందన్న అనుమానాలు కలుగుతున్నాయన్న ఆయన.. 20 శాతం టీటీడీ ఉద్యోగులు అన్యమతస్థులంటూ బండి సంజయ్ వాఖ్యలు చేయడం.. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ వాఖ్యలపై ఇప్పటి వరకు టీటీడీ కానీ, ప్రభుత్వం గానీ.. స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. టీటీడీలో 20 శాతం మంది అన్యమతస్థులు వుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు కరుణాకర్ రెడ్డి. దీనిపై టీటీడీ ఉద్యోగులు కూడా స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..