కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలం ముగిసిపోగా.. వారి సేవలను 2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్..
పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే భారత్ వదిలి వెళ్లిపోండి అంటూ పాకిస్థాన్కు మద్దతు ఇస్తున్నవారిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందే ఎస్పీజీ రంగంలోకి దిగింది.. అమరావతి చేరుకున్న ప్రధాని మోడీ భద్రతా దళం.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించి.. మోడీ టూర్ సాగే రూట్లలో ప్రయాణిస్తూ.. ప్రత్యేకంగా పరిశీలించింది SPG.. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.. భద్రతా ఏర్పాట్లను SPGకి వివరించారు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ లు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఎస్పీజీ అధికారులతో సమావేశం కానున్నారు ప్రధాని టూర్ కోసం…
మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తున్నారు.. అయితే.. ప్రధాని రాకను కూటమి పార్టీలు తమ స్టైల్ లో వినియోగించుకుంటున్నాయట.. బీజేపీ సైతం భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించిందట.. ప్రతీ జిల్లా నుంచి కో-ఆర్డినేటర్లను సిద్ధం చేసారట.. అలాగే ప్రధానంగా బీజేపీ లుక్ కనిపించేలా చూడాలని కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారట..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడతారన్నారు అని వెల్లడించారు మంత్రి నారాయణ.. చట్టబద్ధత విషయంలో రైతుల్లో ఉన్న ఆందోళన నిన్న సీఎం దృష్టికి రైతులు తీసుకు వచ్చారన్నారు నారాయణ..
పీఎస్సార్పై మరో కేసు నమోదైంది.. ఏపీపీఎస్సీ గ్రూప్1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు.. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పీఎస్సార్ ఆంజనేయులు పనిచేసిన సమయంలో.. ఈ అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిదంటూ ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో.. పీఎస్సార్ పై 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..