Fire Accident: తిరుపతి రైల్వే స్వేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలో చెలరేగాయి.. ఈ ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిద అయ్యింది ఓ బోగీ.. అయితే, భారీ స్థాయిలో మంటలు రావడంతో అదే సమయంలో పక్క ట్రాక్‌పై వెళ్తున్న మరో ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా మంటలు అంటుకున్నాయి.. సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. ఎందుకంటే.. సకాలంలో మంటలు ఆర్పివేశారు సిబ్బంది.. అంతేకాదు, మంటలు అంటుకున్న రైల్వే బోగీని పక్కకు తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది.. రైల్వే స్టేషన్ నుంచి గ్యారేజ్‌కు రైలు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు రైల్వే పోలీసులు ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు.. కాగా, సాయంత్రం రాజస్థాన్ వెళ్లాల్సిన హిసార్ ఎక్స్‌ప్రెస్ లో మొదట మంటలు చెలరేగాయి..
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి మరియు వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నడుస్తున్న హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.. దీంతో, ఆ ప్రాంతంలో రైల్వే సేవలను నిలిపివేశారు.. మంటలు వేగంగా వ్యాపించాయి, రైల్వే అధికారులు అత్యవసరంగా స్పందించారు. సమాంతర ట్రాక్‌పై వెళుతున్న వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. ఈ సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.