ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్.. మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి.. 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. దీని వెనక పాకిస్థాన్ ఉందని తేలిపోవడంతో దేశమంతా రగలిపోతుంది. యుద్ధం ప్రకటించి.. దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్థాన్ తిరిగి లేవకుండా.. చావ చితక్కొట్టాలని చాలామంది కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తిరుపతిలో జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఐదుగురు మృతిచెందారు.. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి దగ్గర ఘోరు ప్రమాదం చోటు చేసుకుంది.. కంటైనర్ వాహనం కిందకు దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..
విజయనగరం జిల్లా రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు పూర్ణ తేజేశ్వరరావు ఇంటి దగ్గర ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్కి తరలించారు.
ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న 'వి లాంచ్పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్పో'కు హాజరైన సీఎం.. యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు..
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది.. ఎన్నికల అధికారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది.. ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది హాజరు అయ్యారు.. వైసీపీలో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఎన్నికకు దూరంగా ఉన్నారు..
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర.. 34 ఓట్లతో గెలుపొందరు.. కోవెలమూడి రవీంద్రకు అనుకూలంగా 34 ఓట్లు రాగా.. వైసీపీ తరపున పోటీకి దిగిన అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి..
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్న కుప్పం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. చివరి నిమిషంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం చేరిపోయింది..