ప్రకాశం జిల్లా కొండేపిలో ఎస్సై రమేష్ బాబుపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి.. దళితుల పట్ల జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారు. గంజాయి బ్యాచ్ పై పోలీసులు చర్యలు తీసుకోవడం తప్పా జగన్ ? అని నిలదీశారు.
ప్రజలు చారిత్రక తీర్పునిచ్చన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని సూచించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. సరిగ్గా ఏడాది క్రితం రాష్ర్టంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డ్ పడిందన్న ఆయన.. ప్రజలను వేధించి వేయించుకు తిన్న సైకో నేతకు చాచి కొట్టినట్లు ప్రజలు బుద్ది చెప్పారని పేర్కొన్నారు..
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన చోటు చేసుకున్న ఘటన రాజానగరం గైట్ కాలేజీల్లో కలకలం సృష్టించింది.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న బీటెక్ విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) కాలేజీ హాస్టల్ లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.. ఏకంగా టీడీపీ సానుభూతిపరుల పెళ్లి ఊరేగింపులో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మహిళలు మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు..
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మెగా డీఎస్సీ పరీక్షల నిలుపుదలకు ‘నో’ చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మెగా డీఎస్సీ నిర్వహించకుండా ‘స్టే’ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కీలక పోస్టు దక్కించుకున్నారు.. భారత ఆహార సంస్థ (FCI) కమిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది..