తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చల సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని అభిప్రాయపడ్డారు పలువురు మంత్రులు.. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేయగా.. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు..
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు మంత్రులందరం అభినందనలు తెలిపామని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.
ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఏడాది పాలన పై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.. సంక్షేమ పథకాల విషయంలో జనానికి స్పష్టంగా చెప్పాలని సూచించారు.. తల్లికి వందనం అమలుపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం.. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది..
కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని పోలీసులు, ప్రభుత్వానికి సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా తెలానిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టులో హాజరుపర్చే ముందు హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది..
తుని రైలు దగ్ధం కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అసలు తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది.. తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది..
ఇదే చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయని ఆయనను రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా? అనిఅడుగుతున్నాను అంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆయన.. లో వైఎస్ జగన్.. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ సహా ముగ్గురుని, వాళ్ల కుటుంబాలను పరామర్శించారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు సినీ హీరో అక్కినేని నాగార్జున.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాగార్జున.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. తన చిన్నకుమారుడు అక్కినేని అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు అందజేసిన నాగార్జున.. తన కుమారుడి పెళ్లి రావాలంటూ ఆహ్వానించారు..