Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెగని రీతిలో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచింది. విజయవాడలో ఉదయం నుంచి కంటిన్యూస్‌గా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్మలా సెంటర్, ఆటోనగర్ 100 అడుగుల సెంటర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రోడ్లు కాలువల్లా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుతుండడంతో … పరివాహక ప్రాంత ప్రజల్ని హెచ్చరిస్తున్నారు అధికారులు.. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Read Also: Asia Cup Promo Controversy: సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియోపై టీమిండియా అభిమానుల ఆగ్రహం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆలానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిల్లిని వర్షాల కారణంగా జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. చవితి ఉత్సవాలు వర్షాల్లో జరుపుకుంటున్నారు. అమలాపురం కలెక్టరేట్తో సహా అమలాపురం, రామచంద్రపురం కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలోని కేంద్ర పాలిత యానాంలో ఏకధాటిగా పడిన వర్షానికి ప్రధాన రహదారులు, పట్టణంలోని వీధులు, గణేష్ మండపాలు జలమయమయ్యాయి. ఉదయం నుండి చిన్న చిన్నగా ఉన్న వర్షం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఏకధాటిగా కురవడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. జనాలు ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఉండడంతో తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు.
Read Also: Brahmanda : ప్రివ్యూ చూస్తూ డైరెక్టర్ మృతి.. 29న సినిమా రిలీజ్
అనకాపల్లి జిల్లాలోని జీ కొత్తపల్లి – తురువోలు మార్గంలో మిరాస గడ్డపై వంతెన కూలిపోయింది. కురుస్తన్న వర్షాలకు మిరాస గెడ్డలో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఒకవైపు వంతెన వరద ఉధృతికి కోతకు గురైంది. ఆ తర్వాత వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన కూలిపోవడంతో ప్రజల రాకపోకలతో పాటు పొలాలకు, పశువుల పాకలకు వెళ్లడానికి రైతులకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ ఇనుపతీగల వద్ద కొండచరియ విరిగిపడింది. అదృష్టవశాత్తు గ్రామానికి కొద్ది దూరంలో పడటంతో ప్రాణ నష్టం తప్పింది. కొండచరియలు విరిగి పడటం వల్ల గిన్నెలకొట్ట ఇనుపతీగల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హుకుంపేట మండల కేంద్రంలో ఓ భారీ వృక్షం పాఠశాలపై పడింది. సెలవు రోజు కావడంతో ప్రమాదం తప్పింది. మారేడుమిల్లి మండలం బొడ్లంక వద్ద పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాదాపు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదబయలు మండలం కిమిడిపల్లి పంచాయతీ వద్ద గేదెగడ్డ పొంగి ప్రవహిస్తోంది.
Read Also: Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..
మన్యంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో అల్లూరి జిల్లా పెదబయలు మండలం మారుమూల గుంజివాడకు రాకపోకలు నిలిచిపోయాయి… గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణపు పనులు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో వర్షాకాలం రాకపోకలు స్తంభించే పరిస్థితులు ఏర్పడ్డాయి… శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. 10 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 2 లక్షల 53 వేల 888 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో 3 లక్షల 33 వేల 707 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా…ప్రస్తుతం నీటి మట్టం 883 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా…ప్రస్తుతం 204 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Read Also: Rains : రాబోయే 24 గంటలు అత్యంత భారీ వర్షాలు..
ఇక, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. ఒడిశా తీరాన్ని అనుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేస్తోంది.. అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్ ఘడ్ మీదుగా విస్తరించింది రుతుపవన ద్రోణి… దీని ప్రభావంతో.. రాగాల ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.. పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి..