-
భారత్ కరోనా అప్డేట్.. తగ్గిన కేసులు..
భారత్ కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది… కాకపోతే.. రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు మాత్రం నమోదు అవుతున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,097 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 546 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 35,087 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159కు చేరుకోగా… రికవరీ […] -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం.. ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా మురళీధర్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా చెవ్వూరి హరికిరణ్ ను బదిలీ చేశారు.. ఇక, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా వాడరేవు విజయచంద్‌ను నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ మల్లికార్జున్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా ఎం హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేసిన ఏపీ సర్కార్.. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ […] -
రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక.. ఈసీ నోటిఫికేషన్..
అర్బన్ స్థానిక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 30వ తేదీన రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియకు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవాలని సూచింది.. 11 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్ పర్సన్ల ఎన్నిక ప్రక్రియ జరపాలని ఆదేశించిన ఎస్ఈసీ.. ఈ నెల 26వ తేదీలోగా సభ్యులకు సమాచారం […] -
రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీల లేఖ.. ఎంపీ రఘురామ కంపెనీలపై ఫిర్యాదు..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఇప్పటికే పలు దఫాలుగా లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. ఇక, లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఆయనకు నోటీసులు కూడా వెళ్లాయి.. అంతటితో ఆగకుండా.. ఇప్పుడు.. రఘురామకు చెందిన కంపెనీపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు వైసీపీ ఎంపీలు.. ఇందు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇందు భారత్ కంపెనీ రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని […] -
మార్కెట్లోకి నోకియా 4జీ ఫీచర్ ఫోన్.. రూ.2799 మాత్రమే..!
మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది నోకియా.. అతి తక్కువ ధరకే 4జీ ఫీచర్ ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది.. నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనుండగా.. యల్లో ఆక్వా, బ్లాక్ కలర్లో లభించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మకాలకు సిద్ధంగా ఉంటాయని ప్రకటించింది ఆ సంస్థ.. క్లాసిక్, నియోల మేళవింపుతో నోకియా 110 4జీ […] -
శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో అచ్చపేట మండలం చెన్నారం గేట్ దగ్గర శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇక, ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. ప్రమాదం గురించి తెలిసిన […] -
సెలవున్నా వేతనం, ఫించన్.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..?
నెల మొత్తం పనిచేసి.. ఎప్పుడు తమ ఖాతాల్లో జీతం డబ్బులు పడతాయా? అని ఎదురుచూస్తుంటారు వేతన జీవులు.. ఇక ఫించన్ దారులు పరిస్థితి కూడా అంతే.. తీరా ఆ మొత్తం జమ కావాల్సిన సమయానికి బ్యాంకులకు సెలవు వచ్చాయంటే.. మళ్లీ వర్కింగ్ డే ఎప్పుడా అని చూడాల్సిన పరిస్థితి.. అయితే, ఆ కష్టాలు ఇక ఉండవు.. ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా వెసులుబాటు కల్పించింది. ఇక మీదట వేతనం, పింఛను డబ్బులు సెలవు […] -
తెలంగాణ కోవిడ్ అప్డేట్
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,530 శాంపిల్స్ పరీక్షించగా.. 643 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. తాజాగా 767 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,012కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాతో 3,778 మంది మృతిచెందారు.. 6,26,505 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. రాష్ట్రంలో రికవరీ […] -
ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకొస్తారు..!
వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారు.. ఆయనపై రకరకాల ప్రచారం కూడా జరుగుతోంది.. అయితే, తాను వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలపై స్పందించిన ఆయన.. పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ లో పోలీస్ కేస్ పెట్టారని.. కానీ, కేసులకు భయపడేదిలేదన్నారు.. రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన.. సీఎం.. హుజరాబాద్ లో ఖర్చు పెట్టే వెయ్యి కోట్లు […] -
వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనే 75శాతం పాజిటివ్ కేసులు..!
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారు.. మొదటల్లో కొన్ని అపోహలు ఉన్నా.. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం పోటీపడే పరిస్థితి వచ్చింది. అయితే, గత 4 వారాల్లో సింగపూర్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సింగపూర్ సిటీలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టడంతో టీకాలు తీసుకోని వారిసంఖ్య పరిమితంగా […]
తాజావార్తలు
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
-
Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!