Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
- వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా!
- కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
- ఇటీవల అధికారులపై మండిపడ్డ కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మండి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిధులు ఖర్చు చేయని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.
తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా.. కంగనా రనౌత్‌పై పరోక్షంగా సెటైర్ వేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, MPLADS నిధుల వినియోగంపై అధికారులతో వచ్చే వారం తాను కూడా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నానని చెబుతూ.. కంగనా అధికారులను నిలదీస్తున్న వీడియోను షేర్ చేశారు. దీంతో పరోక్షంగా కంగనా తీరును తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది. ఇద్దరు ఎంపీల మధ్య పరోక్ష యుద్ధం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మహువా మొయిత్రా సోమవారం ఎక్స్‌లో నదియా జిల్లా యంత్రాంగాన్ని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. కృష్ణానగర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ అయిన ఆమె.. చాప్రా బస్‌స్టాండ్, పట్టబుకా ఆడిటోరియం సహా పలు అభివృద్ధి పనుల పురోగతిపై వచ్చే వారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మహువా మొయిత్రా షేర్ చేసిన వీడియోలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందిన అధికారులతో కంగనా రనౌత్ సమావేశమైన దృశ్యాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాధన వినియోగంపై ఆమె అధికారులను ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటంపై కంగనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై ఇంకా చర్చలు జరపడం వల్ల ప్రయోజనం లేదని, వెంటనే పనులు పూర్తి చేసి తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రూ.11 కోట్ల నిధులపై కంగనా ప్రశ్నలు
తన నియోజకవర్గానికి రూ.11 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ ఒక్క పని కూడా చేపట్టలేదని కంగనా ఆరోపించారు. అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పరిస్థితిని “అసమర్థత”, “దయనీయమైన నిర్వహణ”గా అభివర్ణించారు. అధికార యంత్రాంగం పనితీరుపై జాతీయ మీడియా ముందు తాను ఏం సమాధానం చెప్పాలని కంగనా ప్రశ్నించారు. తాజాగా కంగనా అధికారులను నిలదీస్తున్న వీడియోను మహువా మొయిత్రా షేర్ చేయడంతో.. ఇద్దరు ఎంపీల మధ్య రాజకీయంగా పరోక్ష విమర్శలు, సెటైర్లు చర్చనీయాంశంగా మారాయి.
Hello @DM_NADIA_WB & team. This is how other Honourable MPs host meetings to take stock of MPLADS. I will also hold a meeting next week for progress on works including Chapra bus stand, Pattabuka auditorium & others. Please be prepared. Thank you. pic.twitter.com/cJ7rgpmiNr
— Mahua Moitra (@MahuaMoitra) September 7, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!