AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తు ప్రారంభించింది. మండల పరిషత్ నియోజకవర్గాలు (MPP), జిల్లా పరిషత్ నియోజకవర్గాలకు సంబంధించి ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్ నియోజకవర్గాల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను తయారు చేసి, నిబంధనల ప్రకారం ప్రచురించాలని ఈ సందర్భంగా అధికారులకు ఎస్ఈసీ సూచించింది. అలాగే జిల్లా పరిషత్ నియోజకవర్గాల ఫోటో ఓటర్ల జాబితాలను కూడా రెడీ చేసి ప్రచురించాలని జిల్లా ఎన్నికల అధికారులను (సీఈఓలు) ఆదేశించింది. ఓటర్ల వివరాలను సంబంధిత రికార్డులతో పరిశీలించి జాబితాలను రూపొందించాలని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో పూర్వపు 13 జిల్లా ప్రజా పరిషత్‌లను 28 జిల్లా ప్రజా పరిషత్‌లుగా పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాల తయారీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత మండల ప్రజా పరిషత్ (MPP), జిల్లా ప్రజా పరిషత్ (ZPP)ల ఐదేళ్ల పదవీకాలం వరుసగా 2026 సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ముగియనుంది. దీంతో వాటికి త్వరలో రెండో సాధారణ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ కీలకంగా మారింది. ఎన్నికలకు సంబంధించిన తదుపరి ప్రక్రియకు ముందుగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే పనిని ఎస్ఈసీ వేగవంతం చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 11న ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ జరగనుంది.
Also Read
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!