KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh KKR Captain: సెప్టెంబర్ 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు ప్రస్తుతం జరుగుతున్న యూపీ టీ20 లీగ్ 2026లో మేరఠ్ మావెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి తన సత్తా చాటాడు. లక్నో జట్టుకు అనుభవజ్ఞుడైన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రింకు నేతృత్వంలోని మేరఠ్ మావెరిక్స్ అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో ఫాల్కన్స్‌పై ఏకంగా 94 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
యూపీ టీ20 లీగ్ 2026లో రింకు సింగ్ కెప్టెన్‌గా కూడా ఆకట్టుకోవడంతో.. అతడి నాయకత్వ సామర్థ్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ టీ20 లీగ్‌లో మేరఠ్ మావెరిక్స్ జట్టు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా 9 విజయాలు సాధించింది. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు జట్టును విజయవంతంగా నడిపించిన రింకు.. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గానూ తనపై ఉన్న అంచనాలను అందుకున్నాడు. రింకు ఇటీవల చూపిస్తున్న ఫామ్, కెప్టెన్సీ కారణంగా ఐపీఎల్ 2027లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా అతడిని నియమించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ఐపీఎల్ 2026 సీజన్లో రింకు సింగ్ కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు ఆ జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానే క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో.. కొత్త సారథిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రింకు పేరు కెప్టెన్సీ రేసులోకి వచ్చింది. కేకేఆర్‌తో అతడికి ఉన్న అనుబంధం, జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడటం, క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌లను ముగించే సామర్థ్యం అతడికి అదనపు బలంగా మారుతున్నాయి. 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రింకు ఇప్పటివరకు 73 మ్యాచ్‌లు ఆడి 1,394 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. గత ఐపీఎల్ ఎడిషన్‌లో కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు.
టీమిండియా టీ20 జట్టులో ప్రస్తుతం చోటు దక్కకపోయినా.. దేశవాళీ స్థాయిలో తనకు లభించిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ రింకు సింగ్ ముందుకు సాగుతున్నాడు. మేరఠ్ మావెరిక్స్‌కు టైటిల్ అందించిన తీరు చూస్తే.. భవిష్యత్తులో అతడికి జాతీయ జట్టుతో పాటు కేకేఆర్ నాయకత్వ బాధ్యతలు కూడా దక్కే అవకాశాలు లేకపోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించి మంచి సక్సెస్ అందుకుంది. అలానే రింకును కేకేఆర్ కూడా కెప్టెన్‌గా నియమించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతానికి కేకేఆర్ కెప్టెన్సీ రేసులో రింకు పేరు ముందువరసలో ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. కేకేఆర్‌కు బాస్ అయ్యేలా ఉన్నాడు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!