జగన్.. రప్పా.. రప్పా.. వ్యాఖ్యలకు పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్.. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.. అయితే, వైసీపీ వాళ్లు రోడ్డు ఎక్కి పిచ్చి బ్యానర్స్.. రప్పా రప్పా.. గొంతు నరుకతాం.. అంటే..…
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ వైఫల్యం కనిపించడమే కాకుండా ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయి, దిక్కుమాలినిది అయిపోయింది... ఈ స్థాయి కంటే తగ్గి ఇక మాట్లాడలేం... జగన్ వాహనం వల్ల కాదు.. వేరే వాహనం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్పిన తర్వాత మళ్లీ మాట మార్చారు.. చంద్రబాబు తత్వం చూసిన తర్వాత…
ఒకడు నరికేస్తాం అంటాడు. ఇంకొకడు కోసేస్తాం అంటాడు.. ఇవన్నీ మాట్లాడితే తప్పేంటి అని జగన్ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. ఎక్కడ యాక్సిడెంట్ అయిన ఎవరైనా ఏదో ఒక సహాయం చేస్తారు.. స్వయంగా సీఎం చంద్రబాబు దిగి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.. కానీ, జగన్ కు మానవత్వం లేదనే సంగతి క్లియర్ గా అర్ధం అవుతోందన్నారు..
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది.. ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయింది... సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.. సమావేశానికి మంత్రులు నారాయణ, భరత్, అధికారులు హాజరయ్యారు..
సీఎం చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ.. సవాల్ విసిరారు జగన్.. చంద్రబాబు గారు.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఛాలెంజ్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు..
తిరుమలలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో అడుగు ముందుకేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్కి మెషిన్లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డూ ప్రసాదాలు పొందే సౌలభ్యం కల్పించింది. మరో వైపు అదనపు లడ్డూ నియంత్రణపై శ్రీవారి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.