మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా.. ఉత్తర కోస్తా మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు లో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం వాతావరణం కేంద్రం.. రాగల 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.. మరోవైపు, రాగల ఐదు రోజులు పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని.. ఎల్లుండి నుంచి 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయని విశాఖపట్నం వాతావరణశాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు.. ఇక, పాతపట్నంలో 7 సెంటీ మీటర్లు అత్యధిక వర్షపాతం నమోదు అయ్యిందని తెలిపారు..
శ్రీశైలం క్షేత్రంలో కలకలం.. ఆలయంపై మరోసారి ఎగిరిన డ్రోన్..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ ఎగరడం సంచలనంగా మారింది.. ఆలయ పరిసరాలపై అర్ధరాత్రి సమయంలో మరోసారి డ్రోన్ ఎగడరంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అర్ధరాత్రి సమయంలో ఆలయం పరిసరాల్లో డ్రోన్ ఎవరు ఎగరవేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు దేవస్థానం అధికారులు.. ఈ వ్యవహారంపై సెక్యూరిటీ ఆఫీసర్ ఆరా తీస్తున్నారు.. అయితే, శ్రీశైలం ఆలయం పరిధిలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా డ్రోన్ కెమెరాలు ఎగురవేయడంపై నిషేధం ఉంది.. అది కూడా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ ఎగడరంతో.. ఇది ఎవరిపని? అనేది ఇప్పుడు చర్చగా మారింది.. ఆకతాయిల చర్యనా..? ఇంకా ఎవరైనా ఆలయ పరిసరాలను చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. ఆలయ సమీపంలోని ఆకాశాంలో గోపురాల చుట్టూ డ్రోన్ చక్కర్లు కొట్టడం పలు అనుమానాలు తావిస్తోంది.. గుప్త నిధులకోసం ఎవరైనా ఈ పని చేశారా? ఇంకా ఏదైనా ఉందా అనే కోణంలో స్థానికులు, భక్తుల్లో కలరం మొదలైంది.. మరోవైపు శ్రీశైలం క్షేత్ర పరిధిలో డ్రోన్ ఎగిరే దృశ్యాలు ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..
LRS ఫైల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మహిళా అధికారిణి
హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఓ బాధితుడికి చెందిన LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దస్త్రాలపై సంతకం చేసేందుకు మణి హారిక రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఆమెకు ఇప్పటికే కొంత మొత్తాన్ని ముట్టజెప్పినట్లు తెలిసింది. మిగిలిన మొత్తంలో భాగంగా రూ. 4 లక్షలు మంగళవారం తన కార్యాలయంలో స్వీకరిస్తుండగా, ముందుస్తు సమాచారంతో అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, మణి హారికను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు. ఈ సందర్భంగా, రీ-వాల్యుయేషన్ లేదా రీ-ఎగ్జామ్ నిర్వహించాలని హైకోర్టు సూచించిందని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ తరఫున కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, గ్రూప్-1 పరీక్షల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కామ్ జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన, బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ విచారణను కోరాలని సూచించారు. సీఎంఓ ఆఫీసు నుంచే ఈ పోస్టులు అమ్ముడుపోయాయని, రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని ఆయన విమర్శించారు.
పాకిస్తాన్ నుంచి నేపాల్ వరకు.. భారత్ చుట్టూ అశాంతి..
గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి. నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోంది. ఈ నిరసనలు హింసాత్మక అల్లర్లుగా మారాయి. ఆ దేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్‌తో సహా అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను చుట్టుముట్టి దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది ఆందోళనకారులు మరణించారు. చివరకు అల్లర్లతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది, దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
బ్రిక్స్‌పై విషం చిమ్మిన ట్రంప్ సలహాదారు.. రక్త పిశాచి అంటూ పోస్ట్
అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగం కారణంగా రోజురోజుకు అమెరికాకు ప్రపంచ దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. అమెరికా ప్రస్తుతం తనను తాను ప్రపంచానికి మకుటం లేని రాజుగా భావిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ దేశమూ కూడా దాని నియంతృత్వానికి తలొగ్గడానికి సిద్ధంగా లేదు. ట్రంప్ యంత్రాంగం ప్రపంచంతో సంబంధాలను బలోపేతం చేసుకోడానికి దృష్టి సారించాల్సి ఉండగా, వాళ్లు దానికి బదులుగా మరింత దిగజారేలా మాట్లాడుతున్నారు. అమెరికా వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇటీవల రష్యా – భారతదేశం మధ్య సంబంధాల గురించి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కారణంగా తర్వాత ఆయన ఎలోన్ మస్క్‌తో ఘర్షణ పడ్డారని సమాచారం. తాజా ఆయన దృష్టి ఇప్పుడు భారతదేశం నుంచి మొత్తం బ్రిక్స్ సంస్థపైకి మళ్లింది. ఈ సంస్థలో భాగస్వాములైన దేశాలపై అమెరికా సుంకాల యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ బ్రిక్స్ దేశాలు ఏవీ కూడా అగ్రరాజ్యం బెదిరింపులకు తలొగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు.
రోజుకు రెండు పెగ్గుల మద్యం తాగితే మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారు..?
ఆల్కహాల్ ఎక్కువ లేదా తక్కువ తాగినా దాని వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉండవని వైద్యులు అంటున్నారు. మీరు కొద్దిగా మద్యం తాగినా అది మీ గుండెను బలహీనపరుస్తుందని వెల్లడించారు. ఇది రక్తపోటును పెంచుతుంది. ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది. లివర్ సిర్రోసిస్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఒక్కసారి మద్యానికి బానిసైతే మానసిక ఆందోళనలు, ఒత్తిడి , డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అతిగా తాగేవారికి శరీరం, మెదడుపై అదుపు తప్పుతుంది. మందు బాబులే ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లకు కారణమవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి.. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దానిలోని ఇథనాల్ ఆహార నాళంలోకి వేగంగా చేరుతుంది. తరువాత కాలేయానికి చేరుకుంటుంది. ఆల్కహాల్ డీహైడ్రోజినీస్ (ఏడీహెచ్) అనే ఎంజైమ్‌ల ద్వారా జీవక్రియలను నిర్వహించడంలో కాలేయం కీలకమైంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంజైమ్ యాక్టివిటీ పెరిగి కాలేయం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇథనాల్ జీవక్రియలు అధికం కావడం వల్ల కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి. వీటివల్ల పొట్టలో మంట ఏర్పడవచ్చు. అది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డెవలప్ కావడానికి దారితీస్తుంది. ఇది మరింత తీవ్రమైతే ఆల్కహాలిక్ హెపటైటిస్ లేదా సిర్రోసిస్‌కు కారణమవుతుంది.
బైక్ కొనే ప్లాన్ చేస్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన బజాజ్..
బైక్‌కొనే ప్లాన్ చేస్తున్నారా? అయితే, గుడ్ న్యూస్ చెప్పింది బజాజ్ ఆటో లిమిటెడ్.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత.. బైక్‌లతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల ధరలపై ప్రభావం చూపనున్న విషయం విదితమే కాదు.. బజాజ్ మోటార్ సైకిళ్ల ధర రూ.20,000 వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది ఆ సంస్థ.. బజాజ్ ఆటో లిమిటెడ్, ఇటీవలి GST తగ్గింపు ప్రయోజనాన్ని దాని సంబంధిత బజాజ్ మరియు KTM మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్ శ్రేణిలోని వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం యొక్క ఈ చర్య సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి రావడంతో, భారతదేశంలోని అన్ని డీలర్‌షిప్‌లలో తగ్గింపు ధరలతో వినియోగదారులు ఇప్పుడు పండుగ సీజన్‌ను ముందుగానే ప్రారంభించవచ్చు అని పేర్కొంది బజాజ్.. అయితే, పండుగ సీజన్ ప్రారంభం కావడానికి ముందే ధరల తగ్గింపుపై తీసుకున్న ఈ నిర్ణయం.. లక్షలాది కుటుంబాలు, రోజువారీ ప్రయాణికులు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, జీఎస్టీ సంస్కరణలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు పేర్కొంది బజాజ్ ఆటో లిమిటెడ్.. ఇది లక్షలాది మంది భారతీయులకు ప్రత్యక్షంగా ఉపయోగం కలిగిస్తోందని పేర్కొంది. GST తగ్గింపుపై బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై GST తగ్గించాలనే ప్రభుత్వం నిర్ణయం సాహసోపేతమైన ముందడుగుగా అభివర్ణించారు.. ఇది డిమాండ్‌ను మరింత పెంచుతుంది.. పరిశ్రమను దృఢమైన వృద్ధి మార్గంలో ఉంచుతుందని.. లక్షలాది మందికి చేరువ చేస్తుంది.. ఈ చొరవకు భారత ప్రభుత్వానికి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని పేర్కొన్నారు.. బజాజ్ ఆటో లిమిటెడ్‌లో, పండుగ సీజన్ ప్రారంభమైన వెంటనే మా వాహనాలను మరింత సరసమైన ధరకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం.. సకాలంలో సంస్కరణ ఖచ్చితంగా వినియోగదారుల సెంటిమెంట్‌ను పెంచుతుంది.. పండుగ ఉత్సాహాన్ని పెంచుతుందని వ్యాఖ్యానించారు రాకేష్ శర్మ..
ఆసియా కప్ టాప్ 5 రికార్డులు.. సెంచరీలు, వికెట్స్, భాగస్వామ్యాలు అన్నీ మనవే!
ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేశారు. 2022 సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 2016 ఆసియా కప్ క్వాలిఫైయింగ్ గ్రూప్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన బాబర్ హయత్ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 122 పరుగులు బాదాడు. ఆసియా కప్‌లో 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ భారత పేసర్ భువనేశ్వర్ కుమార్. సెప్టెంబర్ 2022లో దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసిన మ్యాచ్ కూడా ఇదే. 2022లో పాకిస్థాన్‌పై భువనేశ్వర్ 26 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నబీ, లసిత్ మలింగ, ప్రమోద్ మధుషన్, ఆమిర్ కలీమ్ టీ20 ఆసియా కప్‌లో 4 వికెట్స్ (4-4) పడగొట్టారు.
అర్ధరాత్రి ఆసుపత్రికి రోహిత్ శర్మ.. వీడియో వైరల్! ఆందోళనలో ఫాన్స్
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య యూఏఈతో బుధవారం తలపడేందుకు భారత జట్టు సిద్ధమవుతుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసుపత్రికి వెళ్లాడు. సోమవారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. రోహిత్ ఆసుపత్రిలోకి ప్రవేశించే సమయంలో రిపోటర్స్ ఫోటోగ్రాఫర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ అర్ధరాత్రి కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. ఆస్పత్రి వద్ద ఉన్న వీడియో వైరల్ కావడంతో హిట్‌మ్యాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. రోహిత్ ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా? అని ఫాన్స్ ఆందోళనలో ఉన్నారు. రోహిత్ ఇటీవల గణపతి పూజలో కనిపించాడు. ఆగస్టు 30, 31 తేదీల్లో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్‌నెస్ పరీక్షను క్లియర్ చేశాడు.
ఫాన్స్ కి కొంచెం ఇష్టం కొంచెం కష్టం
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ #TheyCallHimOG సినిమా హైప్ రికార్డులను సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ #TheyCallHimOG సినిమా హిందీ మార్కెట్‌లో లిమిటెడ్ రిలీజ్‌గా జరుగనున్నట్టు సమాచారం. మునుపటి ఒప్పందాల ప్రకారం, ఈ సినిమాకు మల్టీప్లెక్స్ స్క్రీనింగ్‌లు ఉండవు. ఈ నిర్ణయం ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, సినిమా యొక్క ప్రీ-రిలీజ్ హైప్, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తో ఈ సినిమా విజయం ఖాయమని నమ్మకం వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల బయట ఈ సినిమాకు ప్రమోషన్‌లు చేయకపోవచ్చని సమాచారం. ఆయన ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ, ఇతర నటుల ప్రమోషన్‌లు ఎంత మాత్రం ప్రభావం చూపవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ సినిమాకు ఏ ప్రమోషన్ అవసరం లేదని, ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాత్రమే భారీ ఓపెనింగ్స్‌ను అందిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, సినిమా హైప్ దృష్ట్యా, #OG మొదటి రోజు భారీ కలెక్షన్‌లను సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నాని అన్నా, నీ గోడలో ఇటుకనవుతా
ఇటీవల విడుదలైన “లిటిల్ హార్ట్స్” సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నటుడు మౌళి తనూజ్‌క నటుడు నాని నుంచి ప్రత్యేక ప్రశంసలు అందాయి. ఈ సందర్భంగా, మౌళి తన సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, నాని అన్నకి నేను అభిమానిని అంటూ కొనియాడాడు. ఈ సందర్భంగా ఆయన రాసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాని ఇటీవల తన ఎక్స్ ఖాతాలో “లిటిల్ హార్ట్స్” సినిమా గురించి రివ్యూ షేర్ చేశాడు. ఈ రివ్యూలో, ఆయన ఈ సినిమాను ఒక బ్రీజీ ఫన్ ఫిల్మ్‌గా అభివర్ణించి, దీనిని చూసి ఎంతో ఆనందం పొందినట్టు తెలిపారు. ఈ రివ్యూను గమనించిన మౌళి తనూజ్, తన ఎక్స్ పోస్ట్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు.