వైఎస్ జగన్‌పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రప్పా.. రప్పా.. నరకడానికి వైఎస్ జగన్ ఏమన్నా స్టేట్ రౌడీనా? అని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు రోడ్లపై తిరుగుతారా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. జగన్ రప్పా.. రప్పా లాడిస్తాడనే ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.
తమిళనాడులో పెను విషాద ఘటన చోటుచేసుకుంది.. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల బాలిక రోషిణిని చిరుతపులి లాక్కెళ్లి దాడి చేసింది... కోయంబత్తూర్ సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్‌లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పనిచేస్తుండగా బాలికపై చిరుత దాడి చేసింది. గంటల తరబడి గాలింపు చర్యలు తరువాత అటవీ ప్రాంతంలో బాలిక శరీర భాగాలను గుర్తించారు పోలీసులు.. అప్పటికే చిరుత పులి బాలికను సగం తిన్నట్లుగా పోలీసులు వెల్లడించారు..
World Motorcycle Day: కొందరికి ఎన్ని విలాసాలు ఉన్నా.. మోటార్ సైకిల్‌పై జర్నీ చేయడం అంటే ఎంతో ఇష్టం.. బైక్‌పై వెళ్తూ.. ఆ నేచర్‌ను ఎంజాయ్ చేయడానికి ఎంతో మంది ఇష్టపడతారు.. తమకు విలాసవంతమైన కార్లు ఉన్నా కూడా.. కొందరు బైక్ జర్నీని.. తనకు నచ్చిన బైక్‌పై తిరగడాన్ని ఇష్టపడతారు.. అయితే, జూన్ 21న వరల్డ్ మోటార్ సైకిల్ డేగా జరుపుకుంటున్న సందర్భంగా.. ఒక మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించాల్సిన.. భారత్‌లోని ఐదు […]
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. చిత్తూరులో మాజీ ఎమ్మెల్య చింతల రామచంద్రారెడ్డి సతీమణిని పరామర్శించడానికి కుటుంబ సమేతంగా వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు మనస్థత్వంతోనే మామిడి రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు..
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ బనకచర్లపై సంచలన ఆరోపణలు చేశారు.. జేబులు నింపుకోవడానికే 81 వేల కోట్లతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని విమర్శించారు హర్షకుమార్. ముందు పోలవరం పూర్తి చేయకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైవీఆర్.. నిన్నటి దినం గుత్తి పట్టణంలో టీడీపీ పట్టణ మండల కమిటీ సమావేశాల ఏర్పాటులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. వైసీపీ కార్యకర్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దీనిపై స్పందించిన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు నామినేషన్లు వేస్తే తోకలు కత్తిరిస్తాం అన్న గుమ్మనూరు జయరాంను ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది.. దీంతో, తుది నివేదికను సీల్డ్ కవర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి..
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పమవుతోంది. రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు ఒక ఎత్తయితే.., నియోజకవర్గంలో ఆయా నేతల అనుచరుల ఆగడాలు మరో ఎత్తు అంటున్నారు స్థానికులు. అరాచకాలు ఆధారాలతో లహా బహిర్గతం కావడం, భూ కబ్జాలాంటి ఆరోపణలు, నెలవారీ మామూళ్ల కోసం బెదిరింపులు,
లావు శ్రీకృష్ణదేవరాయలు..... పార్టీలు వేరైనా...వరుసగా రెండు సార్లు నరసరావుపేట ఎంపీగా గెలిచిన నాయకుడు. 2019లో తొలిసారి వైసీపీ తరపున, 2024లో టీడీపీ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారాయన. అంతవరకు బాగానే ఉన్నా... తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో లావు సంబంధాలపై కొత్త చర్చ జరుగుతోంది. పార్టీ మారినా ఆయన తీరు మాత్రం మారలేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. 2019లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు మొదట్లో అంతా బాగానే ఉంది. రాజకీయాలకు కొత్త కావడంతో అందరితో కలిసిపోయినట్టు కనిపించినా..