CM Chandrababu: దసరా మహోత్సవాలకు రండి.. సీఎంకు కనకదుర్గ ఆలయం అధికారుల ఆహ్వానం..
- సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు..
- దసరా మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం..
- సీఎంను కలిసి ఆహ్వానించిన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది.. అయితే, దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు.. క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన అధికారులు, అర్చకులు.. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు.
Read Also: Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందే.. పాకిస్తాన్ బౌలర్ రిటైర్మెంట్!
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
కాగా, బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య సహాయం, శానిటేషన్ వంటి అంశాలపై ఇప్పటికే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అమ్మలగన్నయమ్మ.. ఆమహాశక్తి.. విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేశారు అధికారులు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహోత్సవాల కోసం చేపడుతున్న ఏర్పాట్లు, భక్తుల రద్దీకి అనుగుణంగా వేసిన ప్రణాళికలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిదేశం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది పదకొండు రోజుల పాటు, అమ్మవారు పదకొండు రకాల శోభాయమాన అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాదిగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!