తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సాక మణికుమారి, సాక ప్రసన్నకుమార్ (జెడ్పీ మాజీ ప్రతిపక్షనేత).. తమ మనవడు చిన్నారి ఆద్విక్కు అన్నప్రాసన చేయాలని.. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కోరారు మణికుమారి దంపతులు, ఆద్విక్ తల్లిదండ్రులు డాక్టర్ శృతి, ప్రేమ్కుమార్.. దీంతో, చిన్నారి ఆద్విక్ను ఎత్తుకుని.. ముద్దాడి అన్నప్రాసన చేశారు వైఎస్ జగన్..
అమరావతి అభివృద్ది విషయంలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ).. ఎపీ సీఆర్డీఏ విజ న్ 2047 పేరుతో ఆన్లైన్లో ప్రశ్నావళి రూపొందించింది సీఆర్డీఏ..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గంలో చర్చించారు.. అయితే, తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్..
రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై సైతం మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్లో కాకరేపిన రప్పా.. రప్పా వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు రాగా.. ఇటీవల వైఎస్ జగన్ పర్యటన.. కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు.. అయితే, రప్పా.. రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు అభిప్రాయపడ్డారట.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని చర్చించారట మంత్రులు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇచ్చింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది సిట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్... సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారా..? మధురై మురుగన్ భక్త సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. సనాతన ధర్మాన్ని వదిలేస్తే మనకి మూలాలే మిగలవని వ్యాఖ్యానించారు. హిందూ సంస్కృతి పరిరక్షణలో తన స్థానం స్పష్టంగా ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా హైందవ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ ఎదుగుతున్నారు జనసేనాని.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న వారికి షాకింగ్ లాంటి న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ ప్రకటించారు..
అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు మంత్రి నారా లోకేష్.. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గెలిచింది కూటమికాదు.. ప్రజలు అని పేర్కొన్నారు.. విధ్వంసపాలనపై ప్రజా తిరుగుబాటుగా అభిర్ణించారు.. అయితే, ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించాం.. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ.. ప్రజలకు చేరువగా వెళ్లి సేవలందించండి.. అంటూ సుపరిపాలన – తొలిఅడుగు…