Luxury Cars Prices Dropped: జీఎస్టీ తగ్గింపు.. లక్షల్లో దిగివస్తోన్న లగ్జరీ కార్ల ధరలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
- GST 2.0తో భారీగా తగ్గనున్న లగ్జరీ కార్ల ధరలు..
- మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్..
- జీప్ కార్లపై లక్షల్లో తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Luxury Cars Prices Dropped: జీఎస్టీ శ్లాబులు మారాయి.. గతంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్న పన్ను శ్లాబుల స్థానంలో ఇప్పుడు రెండు కేటగిరీలకు అంటే 5 శాతం, 18 శాతం సరళీకరించింది కేంద్ర ప్రభుత్వం.. అంటే, 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను పూర్తిగా ఎత్తివేసి.. 5 శాతం, 18 శాతం శ్లాబులను మాత్రమే కొనసాగిస్తోంది.. మరోవైపు కొత్తగా 40 శాతం పన్ను శ్లాబును తీసుకొచ్చింది. ఈనెల 22వ తేదీ నుంచే కొత్త జీఎస్టీ శ్లాబుల రేట్లు అమలులోకి రానున్నాయి. వీటి ద్వారా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై పన్ను భారం తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి.. అంతేకాదు, GST 2.0 కింద లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.. మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్, జీప్ సంస్థల కార్ల ధరలు లక్షల్లో తగ్గనున్నాయి..
సెప్టెంబర్ 3, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో కొత్త GST శ్లాబులను ప్రకటించారు. ఈ సమావేశంలో, చిన్న-సెగ్మెంట్ కార్లకు మంత్రిత్వ శాఖ గొప్ప సడలింపును ప్రకటించింది. ఇంతలో, లగ్జరీ కార్లపై 40 శాతం జీఎస్టీ, సెస్ ఛార్జ్ లేదు. ఈ చర్యతో లగ్జరీ కార్ల ధరను కూడా తగ్గించింది, దీంతో, మీ కలల కారును మరింత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది..
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
లగ్జరీ కార్ల బ్రాండ్లు.. తగ్గిన ధరల జాబితా మీ కోసం..
మెర్సిడెస్-బెంజ్
మెర్సిడెస్-బెంజ్ ఏ 200 – రూ. 2.6 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ సీ 300 – రూ. 3.7 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఏ – రూ. 3.8 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌సీ – రూ. 5.3 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యూబీ- రూ. 6 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఈ – రూ. 8 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఎస్ – రూ. 10 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ – రూ. 11 లక్షలు
బీఎండబ్ల్యూ
బీఎండబ్ల్యూ ఎక్స్7 – రూ. 8.9 లక్షలు
బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే – రూ. 1.6 లక్షలు
బీఎండబ్ల్యూ 3 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ – రూ. 3.4 లక్షలు
బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ – రూ. 4.1 లక్షలు
బీఎండబ్ల్యూ ఎక్స్ 1 – రూ. 1.8 లక్షలు
బీఎండబ్ల్యూ ఎక్స్ 5 – రూ. 6.6 లక్షలు
ఆడి
ఆడి ఏ4 – రూ. 2.64
ఆడి ఏ6 – రూ. 3.64 లక్షలు
ఆడి క్యూ3 – రూ. 3.7 లక్షలు
ఆడి క్యూ5 – రూ. 4.55 లక్షలు
ఆడి క్యూ7 – రూ. 6.15 లక్షలు
ఆడి క్యూ8 రూ. 7.83 లక్షలు
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)
* రేంజ్ రోవర్ – రూ. 4.6 లక్షల నుండి రూ. 30.4 లక్షల వరకు
* ల్యాండ్ రోవర్ డిఫెండర్ – రూ. 7 లక్షల నుండి రూ. 18.6 లక్షల వరకు
* ల్యాండ్ రోవర్ డిస్కవరీ – రూ. 4.5 లక్షల నుండి రూ. 9.9 లక్షల వరకు
జీప్
జీప్ కంపాస్ – రూ. 2.16 లక్షలు
జీప్ మెరిడియన్ – రూ. 2.47 లక్షలు
జీప్ రాంగ్లర్ – రూ. 4.84 లక్షలు
జీప్ గ్రాండ్ చెరోకీ – రూ. 4.50 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది..
అయితే, ఆయా ప్రాంతాల్లోని షోరూమ్‌లను బట్టి కూడా పై రేట్లలో కొంత వరకు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందంటున్నారు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..