Off The Record: తెలంగాణ కాంగ్రెస్ లో స్వేచ్ఛ ముదిరి.. స్వేచ్ఛన్నారా అయ్యిందా?
- జూబ్లీహిల్స్ టిక్కెట్ డిమాండ్ చేస్తున్న అంజన్‌కుమార్ యాదవ్..
- యాదవులకు మంత్రి పదవి లేదు కాబట్టి నాకు టిక్కెట్ అంటున్న అంజన్..
- ఇప్పటికే అంజన్ కుమారుడు అనిల్‌కు రాజ్యసభ పదవి..
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంజన్‌కుమార్..
- ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఎలాగన్న చర్చ..
- ఓడితే పార్టీ, ప్రభుత్వం మీద ప్రభావం పడుతుందన్న భయం..
- ఇప్పటికే డివిజన్స్‌లో నేతలకు బాధ్యతలు..
- పని చేయకుండా చేసినట్టు ఎక్కువ మంది బిల్డప్‌లు..
- అధికారులు ఆదేశాలు పట్టించుకోవడం లేదని మంత్రుల బాధ..
- ఎన్నికల దాకా కూల్చివేతలు ఆపమన్నా నో..
- సీఎం దృష్టికి తీసుకెళ్ళే ఆలోచనలో పార్టీ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జూబ్లీహిల్స్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సీనియర్ నేత నవీన్ యాదవ్ పేర్లపై చర్చ జరుగుతోంది. తాజాగా… నేను సైతం అంటూ… తెర మీదికి వచ్చారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి… జూబ్లీహిల్స్ టికెట్ ఖచ్చితంగా నాకే ఇచ్చి తీరాలన్నది ఆయన డిమాండ్. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉందని, ఇక్కడ నాకంటే సీనియర్ యాదవ్ ఎవరున్నారంటూ మెలికపెట్టారాయన. కానీ… ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంజన్‌కి కూడా…గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది పార్టీ. కానీ ఆయన ఓడిపోయారు. అంజన్ ఫ్యామిలీ హైదరాబాదులో పార్టీకి కొంత అండగా ఉందన్న ఉద్దేశ్యంతోనే…. సీఎం రేవంత్ రెడ్డి అనిల్‌ను రాజ్యసభకు ప్రమోట్ చేశారు. కానీ…. అంజన్ కుమార్ మాత్రం… అనిల్‌కి యూత్ కాంగ్రెస్ కోటాలో ఇచ్చారు, నేను పార్టీ కోసం చేసిన సేవ గుర్తించండంటూ… కొత్త చర్చను తెరమీద తెచ్చారు. ఇప్పటికే అంజన్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
Read Also: Off The Record: అమరావతి విషయంలో వైసీపీ యూ టర్న్ ఆ పార్టీకి ప్లస్సా..? మైనస్సా..?
Also Read
ఇలా… అన్ని పదవులు ఒకే కుటుంబానికేనా అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో.. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో… చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది పీసీసీ నాయకత్వం. ఒకవేళ చిన్న లెక్కతప్పి ఓడిపోయినా… అది పార్టీతోపాటు ప్రభుత్వం మీద కూడా విమర్శలకు, వ్యతిరేక ప్రభావానికి తావిచ్చినట్టు అవుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదే ఉద్దేశంతో అటు పిసిసి, ఇటు సీఎం పార్టీ నాయకులకు ఇప్పటినుంచే బాధ్యతలను అప్పగించి పనిలో పెట్టినా… బాధ్యులు మాత్రం పూర్తి స్థాయిలో గేరప్ అయినట్టు కనిపించడం లేదంటున్నారు. నాయకులంతా… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో నాకేంటి లాభమన్న తరహాలోనే ఆలోచిస్తున్నట్టు కనబడుతోందంటున్నారు పరిశీలకులు. ఇదే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోందట. దీనికి తోడు కార్పొరేషన్ చైర్మన్స్‌ను డివిజన్ల వారీగా ఇన్చార్జిలుగా నియమించింది పార్టీ. ప్రతి పోలింగ్ బూత్ ని టచ్ చేయడంతోపాటు ఓటరు మ్యాపింగ్ చేయాలని ఆదేశించినా… వాళ్ళంతా డివిజన్లో సమావేశాలకు పరిమితం అవుతున్నారు తప్ప అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో చేయడం లేదని తెలుస్తోంది.
Read Also: The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
ఒకరిద్దరు నేతలు తప్పితే మిగిలిన వాళ్ళంతా…డివిజన్ నాయకులని పోగేసుకొని సమావేశాలు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారనేది పార్టీ దగ్గరున్న నివేదిక. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా ఎవరు ఏం చేస్తున్నారు నాకు తెలుసు అంటూ సీఎం నర్మగర్భంగా అన్నట్టు తెలిసింది. ఎన్నికలు గెలిచి తీరాలని, ఇది అందరికీ టాస్క్ అంటూ పార్టీ కూడా స్పష్టం చేసింది. కానీ…ఎక్కువ మంది అప్పగించిన పనిని పూర్తిస్థాయిలో చేయకుండా…చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రభుత్వ దగ్గర ఉందట. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతలు అప్పగించిన చాలామంది కార్పొరేషన్ చైర్మన్స్‌కు త్వరలోనే పదవీకాలం ముగియబోతోంది. అందుకే… ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే… ఇక రెన్సువల్స్ ఉండబోవన్న సంకేతాల్ని కూడా పంపుతోందట పీసీసీ నాయకత్వం. మరోవైపు ఈ పరిధిలోని అధికారులు కొందరు మంత్రుల ఆదేశాల్ని కూడా పట్టించుకోవడం లేదంటూ…వాపోతున్నారు ఓ మంత్రి. ఓవైపు ఉప ఎన్నికలు పెట్టుకొని.. ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో అక్కడక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయని, వాటిని ఆపమని పట్టించుకోవడం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోతే ఆ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి… వ్యవహారాన్ని నేరుగా ఆయన దృష్టికే తీసుకెళ్తే సరిపోతుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి కాంగ్రెస్‌లో.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!