స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు.. అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలపై జరుగుతోన్నఅఘాయిత్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి మారాలన్నారు.. న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమని.. బయటికొచ్చి న్యాయం చేయాలన్న ఆయన.. తెలంగాణలో మృగాళ్లను సీపీ సజ్జనార్ వేటాడిన విధానం అద్భుతం.. అందుకే సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను మరోసారి అభినందిస్తున్నట్టు తెలిపారు.. మగాడు సమాజానికి రక్షణ కల్పించాలి… కానీ, మృగంలా మారకూడదన్న ఆయన.. మృగాల్లా వ్యవహరించేవాళ్లను క్షమించకూడదు అన్నారు.
స్త్రీని అగౌరపరచి… మానాన్ని అహరించిన వాడిని ఈ భూమి మీద లేకుండా చేయాలి అంటూ వ్యాఖ్యానించారు ఏపీ స్పీకర్ తమ్మినేని.. అవుటాఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో సమాంతర న్యాయం సాధ్యమవుతుందన్నారు.. అన్నదమ్ములు , కన్న తండ్రి సైతం ఆడపిల్లల పై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.. అసలు సమాజం ఎటు వైపు వెళ్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాముడు వెలసిన పుణ్యభూమి, కృష్ణుడు పుట్టిన ఖర్మభూమి మనది.. ఏమైంది మన గొప్ప సంస్కృతికి..? మనం ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచీ సుమతీ శతకంలో చెప్పారు..? మరోమారు మనం మనల్ని పునఃసమీక్షించుకోవాలని సూచించారు.. మనం రూపొందించుకున్న చట్టాలను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్న తమ్మినేని.. దిశయాప్ ను ఉపయోగించుకుంటూనే సమాజంలో మానసికమైన మార్పును తీసుకురావాలని సూచించారు.
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..