తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. ఇక, భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 36 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు.. మరికొంతమంది గల్లంతు కాగా.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి.. ఇప్పటికే కొందరిని కాపాటినట్టు తెలుస్తుండగా.. శిథిలాల కింది ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై వివరాలు లేవు.. రాయగఢ్ జిల్లాలో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొల్హాపూర్ జిల్లాలోని 47 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు.. 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. అయితే, శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకోవడం, కొందరు గల్లంతు కావడంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.