తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ కామెంట్ చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. టీఆర్ఎస్ నుంచి వలసలపై స్పందించిన ఆయన.. ఆలే నరేంద్రను వెళ్లకొట్టారు, విజయ శాంతి, స్వామి గౌడ్ వంటి ఎంతో మందిని బయటకు పంపించారు.. ఇప్పుడు ఈటల వంతు వచ్చిందన్నారు.. మధుసూదనాచారిని కేసీఆరే ఓడగొట్టారంటూ విమర్శించిన ఆయన.. ఇక, మిగిలింది హరీష్ రావే!.. హరిష్ రావుకు కూడా అనేక అవమానాలు జరిగాయని చెప్పుకొచ్చారు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు […]
హైదరాబాద్‌లో ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.. దీంతో బోయిన్‌పల్లిలో విషాదం నెలకొంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రమాదవశాత్తు చిన్నతోకట్ట నాలాలో పడిపోయాడే ఏడేళ్ల బాలుడు ఆనందసాయి.. నాలా నిర్మాణంలో ఉండగా.. ఇంటిముందు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు… విషయం తెలుకున్న స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా.. ఆ బాలుడు ప్రాణాలు దక్కలేదు.. నాలాలో పడిపోయిన ఆ బాలుడు మృతదేహంగా […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఐ నేత చాడా వెంకట్‌రెడ్డి.. టీఆర్ఎస్కు రాజీనామా సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. ఈటల పచ్చి అవకాశవాదని వ్యాఖ్యానించిన చాడా… మతోన్మాద పార్టీ (బీజేపీ)లో చేరుతూ సీబీఐ మీద నిందలు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే మా పార్టీ కార్యాలయాన్నే ధర్నా చౌక్‌గా మార్చిన చరిత్ర సీపీఐది అన్న ఆయన.. అసైన్ భూములు […]
ఇంకా అనుకున్న స్థాయిలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో తమిళనాడులో మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్రభుత్వం.. ఇప్పటి వరకు లాక్డౌన్ ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండగా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకించారు.. అయితే, పాజిటివ్ కేసుల ఆధారంగా.. ప్రాంతాల వారీగా సడలింపులు ఇచ్చింది సర్కార్.. కోవిడ్ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ సడలింపులు […]
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని విరమించిన గొప్ప ప్రజాస్వామిక వాది రావి నారాయణరెడ్డి అని గుర్తుచేసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు, ప్రజాస్వామికవాది, రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేసీఆర్.. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల కూడా ప్రదర్శించిన సానుకూల స్ఫూర్తి, గొప్పదని స్మరించుకున్నారు. దేశంలో జరిగిన […]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ నెల 10వ తేదీన కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీస్ కార్యాలను ప్రారంభించనున్నారు.. ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని భవనాలను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.. కామారెడ్డి పట్టణ శివారులోని నూతన కలెక్టరేట్, పోలీసు భవనాల నిర్మాణ పనులను 2017లో అప్పటి రెవెన్యూశాఖ మంత్రి మహ్మద్‌అలీ ప్రారంభించగా.. సుమారు 30 ఎకరాలలో రూ.66 కోట్ల నిధులతో […]
వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్న ఆయన.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.. మరోవైపు […]
క్రికెట్ ఆడుతుండగా పిడుగు పాటుతో ఓ యువకుడు కన్నుమూశాడు.. మరో ఎనిమిది మంది యువకులు గాయాలపాలయ్యారు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులోని ఈశ్వరమ్మ కాలనీలో శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆటకు ప్రారంభించారు స్థానిక యువకులు.. రెండు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడుతున్నారు.. అయితే, అదే సమయంలో.. భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది.. క్రికెట్ ఆడుతూ.. ఎంజాయ్ చేస్తున్న ఆ యువకులు ఊహించని ఘటన జరిగింది.. […]
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ షాకిచింది.. ఆయన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొలగించింది సోషల్ మీడియా దిగ్గజం.. ఆయన భారత ఉపరాష్ట్రపతిగా ఉండడంతో.. ఆయన కార్యాలయం నిర్వహిస్తోన్న వీపీ సెక్రటేరియట్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా) ఖాతాకు మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌తో కొనసాగిస్తోంది.. కాగా, వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి గతేడాది జులై 23వ తేదీన ట్వీట్ చేశారు.. ఆయనను దాదాపు 13 లక్షల […]
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి షాక్ ఇచ్చింది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్స్‌లో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని చట్టసభ్యులు ధ్రువీకరిస్తున్న నేపథ్యంలో.. ట్రంప్ అభిమానులు, ఆ భవనంపై దాడికి దిగడం.. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.. అయితే.. దీనికి కారణం ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో […]