టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ రిచార్జ్ ప్లాన్‌లో భారీ మార్పులు చేసింది. మినిమం మంథ్లీ ప్రిపెయిడ్ రీచార్జి ప్లాన్ 49 రూపాయలని పూర్తిగా ఎత్తివేసింది. దాన్ని 79 రూపాయలకి పెంచింది. ఇకపై 49తో రీచార్జ్ చేసుకునేందుకు వీల్లేదు. 79తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు సెకెనుకు ఒక పైసా.. 64 రూపాయలు టాక్‌టైమ్, 200 MB డేటా వస్తోంది.. ఈ ప్లాన్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. కాగా, పాత ప్లాన్‌తో పోల్చితే కొత్త ప్లాన్‌లో నాలుగు రెట్లు అధికంగా టాక్ టైం, రెట్టింపు డాటా వినియోగదారులకు లభిస్తుందని తెలియజేసింది ఎయిర్‌టెల్.