అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మరోసారి టీఎంసీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. వరుసగా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్‌బై చెప్పి.. మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.. దీంతో.. నష్టనివారణ చర్యలు చేపట్టింది బీజేపీ అధిష్టానం.. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్‌గా ఉన్న దిలీప్ ఘోష్‌పై వేటు వేసింది.. ఆయన స్థానంలో ఎంపీ సుకంత మజుందర్‌ను నియమించింది. కాగా, బెంగాల్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే.. భారతీయ జనతా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టీఎంసీలో చేరారు. ఈ వ్యవహారంలో దిలీప్ ఘోష్‌పై పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించారు.. ఈ తరుణంలో.. అధిష్టానం ఆయనపై వేటు వేసింది.