ఆరు సార్లు ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించారు.. ఇప్పుడు రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. మోత్కులగూడెం 90శాతం టీఆర్ఎస్ వైపు వచ్చిందన్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.. 18 ఏళ్లలో మీకు ఈటల చేయని పని, మీ స్వంత జాగాలో ఇండ్లు కట్టించే బాధ్యత నాదే అన్నారు. నాయిని చెరువు దగ్గర బతుకమ్మ ప్లాట్ ఫామ్, గణేష్ నిమజ్జనానికి ప్లాట్ ఫామ్ కట్టిస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఓటు వేసేటప్పుడు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరను గుర్తు చేసుకోండి.. ఉన్న ఉద్యోగాలను ఊడ గొట్టే పార్టీ బీజేపీ.. మన ముఖ్యమంత్రి 1 లక్షా 30 వేల ఉద్యోగాలు ఇప్పించారని.. రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తున్నాం అన్నారు.
ఇక, గడియారాలు, బొట్టు బిల్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగం అయిపోతారని సూచించారు మంత్రి హరీష్‌రావు.. రూపాయి బొట్టుబిల్ల ఇచ్చిన బీజేపీకి ఓటు వేద్దామా, కళ్యాణ లక్ష్మి లక్షా 116 రూపాయలు ఇచ్చే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా ఆలోచన చేయాలన్నారు. ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి.. మోత్కులగుడెంలో 300 ఇండ్లు కట్టిస్తాం.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం అన్నారు.. రెండు గంటలు భూమి ఉన్న పేదవాడు శ్రీనివాస్.. మీ తలలో నాలుక లాగా మేదులుతాడు అని తెలిపారు.. సహాయం చేస్తున్న చేతులు టీఆర్‌ఎస్‌వీ, పేదలకు భారం మోపుతున్న పార్టీ బీజేపీ.. ఆలోచన చెయ్యండి దున్న పోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే వస్తాయా? అని ప్రశ్నించారు. మరోఐపు.. గెల్లు శ్రీను గెలుపు ఖాయం.. ఎంత మెజారిటీ వస్తది అనేది చూస్తున్నాం అన్నారు హరీష్‌రావు.. మేం చెప్పిన మాట అమలు అవుతుందా లేదా గెలుచిన తర్వాత కూడా శ్రీనుకి అండగా ఉండి పర్యవేక్షిస్తాం అన్నారు.