కోకాపేట్, ఖానామెట్ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. కనక వర్షమే కురిసింది.. అయితే, ఖానామెట్ భూముల వేలంపై కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను వేలం వేశారు.. అయితే, 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం కూడా ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టగా.. ఆ స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు స్థానికులు… […]
ఇళ్లలో పేపర్లు కనిపిస్తే చాలు ఎలుకలు నుజ్జు నుజ్జు చేసిన ఘటనలు ఎన్నో చూసి ఉంటారు.. కానీ, ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించి కొంత… అప్పు తెచ్చి మరికొంత.. ఇంట్లో దాచుకున్నాడు.. కానీ, ఆ మొత్తం సొమ్మును ఎలుకలు నుజ్జు..నుజ్జు చేయడంతో లబోదిబోమనడం బాధితిడి వంతు అయ్యింది… మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్ తండాకు చెందిన […]
పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ ప్రెటోల్ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, […]
కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపికే.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగుతోంది.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు యడియూరప్ప.. దీంతో.. ఢిల్లీలో ఏదో జరుగుతోంది.. యడియూరప్ప రాజీనామా చేయడం ఖాయమనే ప్రచారం జోరుందుకుంది. కరోనా సమయంలోనూ కొంతమంది మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు యడియూరప్పను టార్గెట్ […]
క్రమంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది… ప్రతీ వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో డేటా ఉండడంతో.. అంతా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను లైక్‌లు, షేర్లతో ముంచెత్తుతున్నారు.. కొన్నిసార్లు.. అది తప్పుడు సమాచారం అయినా.. ఎక్కువ మంది షేర్ చేస్తూ పోతున్నారు.. అది ఫేక్ అని తెలిసే లోపే జరాగాల్సిన నష్టం జరిగిపోతోంది.. అయితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేవారు.. తప్పుడు సమాచారంతో […]
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది… పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన శోభాహైమావతి.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. 1999-2004 మధ్య ఎస్.కోట ఎమ్మెల్యేగా పని చేసిన హైమావతి… గత ఎన్నికల కంటే ముందు వరకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు.. పార్టీల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. అయితే, ప్రస్తుతంలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోవడానికి తోడు… టీడీపీలో అంతర్గత రాజకీయాలు కూడా ఎక్కువైనట్టుగా […]
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టినా.. తాజా హెచ్చరికలు భయపెడుతూనే ఉన్నాయి… సెకండ్ వేవ్ కేసులు పూర్తిస్థాయిలో తగ్గకముందే.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభదశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే మరోసారి వినాశనం తప్పదని పేర్కొంది. అయితే, భారత్‌లో కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి… కేసులు తగ్గుముఖం పట్టడంతో.. లాక్‌డౌన్‌కు గుడ్‌బై చెప్పి.. అన్‌లాక్‌కు వెళ్లినా.. ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.. […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం గెజిట్లు విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇక, త్వరలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నీటా వాటాల విషయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.. సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని ఎంపీలకు స్పష్టం చేశారు కేసీఆర్. లోక్ సభ, రాజ్యసభల్లో, సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటాకోసం కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని […]
కరోనా మహమ్మారి విజృంభణతో రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి… ప్రత్యేక రైళ్లు, ఆక్సిజన్ కోసం రైళ్లు తప్పితే.. సాధారణ రైళ్లు పట్టాలెక్కింది లేదు.. కానీ, రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పేసింది దక్షిణ మధ్య రైల్వే.. 82 రైళ్లను పునరుద్దరించేందుకు సిద్ధమైంది.. 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.. ప్యాసింజర్ రైలులో ప్రయాణానికి స్టేషన్లోనే టికెట్లు ఇవ్వనున్నారు అధికారులు… ఇక ఈ […]