కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా యాత్ర నిర్వహించారు.. కూరగాయల మార్కెట్ నుండి ఎంఆర్‌వో కార్యాలయం వరకు పాదయాత్రగా.. భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సీతక్క.. అయితే, దండోరయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.. ఒక్కసారిగా బీపీ పడిపోవటంతో కళ్లు తిరిగి పడిపోయారు సీతక్క.. దీంతో.. వెంటనే ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కార్యకర్తలు.. సీతక్క ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు వైద్యులు..