అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మృతి కేసులో రంగంలోకి దిగింది సీబీఐ.. నరేంద్ర గిరి అనుమానాస్పద మరణంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కాగా.. ఇక, యూపీ సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో.. రంగంలోకి దిగింది కేంద్ర దర్యాప్తు సంస్థ.. యూపీ పోలీసుల నుంచి కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.. ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
కాగా, సోమవారం అలహాబాద్‌లోని బాఘంబరి మఠంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.. మఠం అతిథి గృహంలో ఆయన పైకప్పునకు వేలాడుతూ కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గదిని పరిశీలించగా 8 పేజీల లేఖ ఒకటి లభించింది. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించినా… సూసైడ్ నోట్‌లోని అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం శిష్యులను విచారించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇక, 18 మంది సభ్యులతో ‘సిట్’ ఏర్పాటు చేసిన యూసీ సర్కార్.. మహంత్ శిష్యుడిని అదుపులోకి తీసుకున్నారు.. మరోవైపు.. తాను మానసికంగా దెబ్బతిన్నానని, ఇందుకు తన శిష్యులలో ఒకరు బాధ్యలని మహంత్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో.. సీబీఐ దర్యాప్తు డిమాండ్ తెరపైకి రావడం.. యూపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం.. దానికి కేంద్రం కూడా ఆమోదం తెలపడంతో.. ఇక, తన పనిని ప్రారంభించింది సీబీఐ.