శ్రమదానం పవన్ కొత్త వేషం.. ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ కోసమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న ఆయన.. ఉనికి కోసం బూటకపు రోడ్డు శ్రమ దానాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు.
ఇక, పవన్ కల్యాణ్ ది ప్యాకేజీ కోసమే ఆరాటం తప్ప… ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు మంత్రి శంకర్ నారాయణ.. పవన్ పార్టీ పెట్టింది తన స్వలాభం కోసం… తన విలాసవంతమైన జీవితం గడపడం కోసమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.. మరోవైపు, రోడ్ల శ్రమదానం పేరుతో కొత్త వేషం వేస్తున్నాడని మండిపడ్డ ఆయన.. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని గ్రహించాలన్నారు. కాగా, ఇవాళ రాజమండ్రితో పాటు.. అనంతపురం జిల్లాలోనే పర్యటించనున్న పవన్ కల్యాణ్.. అక్కడ రోడ్ల మరమ్మతుల కోసం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.
Also Read
- AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
- Cyclone Akvan : ఊపిరి పీల్చుకున్న ఏపీ తీరం.. తప్పిన అతి తీవ్ర తుఫాన్ ముప్పు
- Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న "అక్వాన్ తుఫాన్".. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!
- Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Food Safety Raids: హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్, 2 సీజ్..
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..