ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే కృష్ణానది యాజమాన్యబోర్డుకు ఇరు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతుండగా.. అటు గోదావరి నది యాజమాన్య బోర్డుకు కూడా కొన్ని ఫిర్యాదులు వెళ్లాయి.. తాజాగా, తుంగభద్ర బోర్డు సెక్రెటరీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు.. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్డీఎస్ కి రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో 5, 6 టీఎంసీలకు మించి అందడం లేదని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు… అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం అటూ తుంగభద్ర నీటిని, ఇటు శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని యథేచ్ఛగా తరలిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్న తెలంగాణ ఇరిగేషన్ ఈఎస్సీ.. కాబట్టి, ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయించి ఆర్డీఎస్ కు పూర్తిస్థాయిలో నీటిని అందించాలని తెలంగాణ ఈ లేఖలో తన లేఖలో కృష్ణానది యాజమాన్య బోర్డును విజ్ఞప్తి చేసింది.