కరోనావైరస్.. డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేసింది.. ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది లేకపోగా… థర్డ్ వేవ్ ముప్పు ఉందనే ముందస్తు హెచ్చరికలు కూడా ఉన్నాయి.. కానీ, బయట చూస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంది.. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి.. కాస్త కేసులు తగ్గుముఖం పట్టగానే.. నిబంధనలు గాలికొదిలేసి ప్రజలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు.. అయితే, కోవిడ్ 19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. కరోనా ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని.. కానీ, ఆ మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తాజాగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల గణాంకాలను బయటపెడుతూ.. గత వారం ప్రపంచ వ్యాప్తంగా 31 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని.. మరో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయరని వెల్లడించింది.
ఇక, ఇప్పటికే కొన్ని దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ ప్రారంభమైందని.. కోవిడ్ బాధితులతో ఆస్పత్రులు అన్నీ నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, కరోనా నిబంధనలు పట్టించుకోకుండా కొందరేమో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు.. ఈ రెండేళ్లలో కరోనా కాటుకు 50 లక్షల మంది ప్రాణాలు విడిచారని పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో… కాగా, కొన్ని ప్రాంతాల్లో తగ్గిననట్ట తగ్గి మళ్లీ కరోనా రోజువారి కేసులు పెరుగుతోన్న సంగతి తెలిసిందే.. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. మరికొంతకాలం కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక, వ్యాక్సినేషన్‌తో రక్షణ కలుగుతుందని చెబుతున్నారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!