డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో చోరీ.. ఆపై వింత లేఖ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీళ్లు మామూలు దొంగల కాదు.. ఎందుకంటే ఏకంగా డిప్యూటీ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు.. ఉన్నకాడికి ఊడ్చేశారు.. అయినా వారికి ఏదో వెలితి అనిపించినట్టుంది… ఎందుకంటే.. దొంగతనం చేసింది డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో.. దొరికిన నగదు చాలా తక్కువ అని ఫీలయ్యారేమో.. అక్కడ ఓ లేఖను వదిలివెళ్లారు.. ఆ తర్వాత ఆ లేఖ చూసిన డిప్యూటీ కలెక్టర్ షాక్ తిని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరరిగింది..
ఆ ఘటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు సమీంలోని సివిల్ లైన్స్‌లోని త్రిలోచన్ గౌర్ బంగ్లాలో ఓ డిప్యూటీ కలెక్టర్ నివాసం ఉంటున్నాడు. అయితే, ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న రూ. 30 వేలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు.. అయితే, అక్కడ ఒక లేఖ కూడా వదిలివెళ్లారు.. ఆ లేఖలో ఏముందంటే.. “జబ్ పైసే నహీ వారు తోహ్ లాక్ నహీ కర్నా థా నా కలెక్టర్ (ఇంట్లో డబ్బు లేనప్పుడు లాక్ ఎందుకు వేశారు, కలెక్టర్) అంటూ హిందీలో ఓ చీటి రాసి అక్కడ వదిలివెళ్లారు. ఇక, 15-20 రోజుల తర్వాత తిరిగొచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించారు.. అదే సమయంలో ఆ లేఖ ఆయన కంటపడింది.. ఆ లేఖను పోలీసులకు అందజేసి.. ఇంట్లో రూ. 30 వేలు, బంగారు ఆభరణాలు అపహరించినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. మొత్తంగా దొంగల చేసిన ఆ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!