తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.. ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానాన్ని అందుకున్నారు కేటీఆర్.. ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే అంభిషన్ ఇండియా (ambition India- 2021) సదస్సులో ప్రసంగించాల్సిసిందిగా అక్కడి ప్రభుత్వం ఆహ్వానించింది.. గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా(era) అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు మంత్రి కేటీఆర్.. ఈ నెల 29న ఫ్రెంచ్ సెనేట్లో జరిగే అంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిగా విజ్ఞప్తి చేసింది ఫ్రెంచ్ ప్రభుత్వం.. ఆ దేశ ప్రధాని ఇమ్మాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో ఏర్పాటయిన ఈ సదస్సు భారత్- ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో పేర్కొంది.
ఇక, గతంలో నిర్వహించిన అంభీషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని, ఈ సారి సైతం అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని లేఖలో కేటీఆర్‌కు వివరించిన ఫ్రెంచ్ సర్కార్.. ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.. ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్ కేర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపై ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.. మరోవైపు.. ఫ్రెంచ్ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్, ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందని, ఫ్రెంచ్ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలను దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు మంత్రి కేటీఆర్.