భారత్ కోవిడ్ అప్డేట్.. భారీగా తగ్గిన కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, శుక్రవారం దసరా పండగ కావడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గిపోయింది.. అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 9,23,003 శాంపిల్స్ పరీక్షించగా.. 15,981 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 116 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 17,861 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్..
ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. 3,40,53,573కు పెరగగా… కోలుకున్నవారి సంఖ్య 3,33,99,961కు చేరింది.. మరోవైపు.. కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 4,51,980కు పెరగగా.. ప్రస్తుతం దేశంలో 2,01,632 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. శుక్రవారం ఒకేరోజు దేశ్యాప్తంగా 8.36 లక్షల మందికి టీకా పంపినీ చేయగా.. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 97,23,77,045కి పెరిగింది.. దసరా పండుగ నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు శుక్రవారం వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!