ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది.. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్కూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, బస్సులో ప్రయాణం.. కల్పిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. కాగా, ఇప్పటికే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రియాంక… తాజాగా ఉచిత హామీలను ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా.. తాము ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేదానిపై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు ప్రియాంక. ఇక, ఈ సమయంలో అందివచ్చే ఏ అవకాశాన్ని వదలకుండా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.